రామ్ హీరోగా కృతిశెట్టి హీరోయిన్ గా లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన ది వారియర్ మూవీకి క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు రాగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బిలో యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది. ఈ సినిమా నిర్మాతలకు సైతం భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయని సమాచారం అందుతోంది. ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ ది వారియర్ మూవీ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ది వారియర్ మూవీ సర్పయాగం, మానవుడు దానవుడు లాంటి మూవీ అని ఆయన చెప్పుకొచ్చారు.
మానవుడు దానవుడు, సర్పయాగం సినిమాలు అప్పట్లో సక్సెస్ సాధించాయని ఆయన చెప్పుకొచ్చారు. ది వారియర్ మూవీలోని రామ్ పాత్రపై ఇస్మార్ట్ శంకర్ రోల్ ప్రభావం పడిందని పరుచూరి కామెంట్లు చేశారు. రామ్ మూవీ అంటే ప్రేక్షకులు లవ్ సీన్స్ ను ఆశిస్తారని రామ్ కృతి మధ్య లవ్ సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. హీరో రోల్ కంటే విలన్ రోల్ ను ఈ సినిమాలో హైలెట్ చేశారని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
సినిమాలోని కొన్ని డైలాగ్స్ బాగున్నాయని పవర్ ఫుల్ డైలాగ్స్ ను విలన్ చేత దర్శకుడు చెప్పించారని పరుచూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. హీరో పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదును వెనక్కు తీసుకునే సన్నివేశాన్ని మరో విధంగా తీసి ఉంటే బాగుండేదని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ది వారియర్ మూవీ క్లైమాక్స్ లో కొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండేదని ఆయన కామెంట్లు చేశారు.
ది వారియర్ మూవీలో రామ్ పోతినేని నటన బాగుందని పరుచూరి తెలిపారు. డైరెక్టర్ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ సినిమా బెటర్ రిజల్ట్ ను అందుకుని ఉండేదని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. రైటర్లు హీరో ఇమేజ్ కు అనుగుణంగా కథ రాయాలని ఆయన చెప్పుకొచ్చారు.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!