Radhe Shyam Movie: రాధేశ్యామ్ మూవీకి పరుచూరి రివ్యూ ఇదే!

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా రికార్డుస్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావించగా ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ఇండస్ట్రీలో తనను పెదనాన్న అని పిలిచే హీరోలలో ఒకరని ఆయన తెలిపారు. ఈ సినిమాను చూడగానే నాకు పాతాళభైరవి, మల్లీశ్వరి(సీనియర్ ఎన్టీఆర్ మూవీ) గుర్తుకు వచ్చాయని గోపాలకృష్ణ అన్నారు.

తన అంచనాల ప్రకారం పాతాళభైరవి ముందు మల్లీశ్వరి విడుదలై ఉంటే సూపర్ హిట్ అయ్యేదని ఆయన అన్నారు. ప్రభాస్ లవ్ స్టోరీ చేస్తున్నాడని అనగానే వర్షం, మిర్చిలాంటి సినిమాలు మెదులుతాయని గోపాలకృష్ణ తెలిపారు. రాధేశ్యామ్ సినిమాలో మళ్లీమళ్లీ వినాలపించే పాటలు అయితే లేవని ఆయన అన్నారు. ఫైట్లు కూడా ఈ సినిమాలో మిస్ అయ్యాయని ఆయన తెలిపారు. అల్లూరి సీతారామరాజు తర్వాత కృష్ణ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని గోపాలకృష్ణ పేర్కొన్నారు.

అలాంటి నష్టం రాధేశ్యామ్ కు జరిగిందని బాహుబలి తర్వాత ప్రభాస్ అంటే ఆకాశమంత ఇమేజ్ ఉందని వర్షం, మిర్చి టైప్ లో తీసి ఉంటే రాధేశ్యామ్ సినిమాకు మెరుగైన కలెక్షన్లు వచ్చేవని గోపాలకృష్ణ వెల్లడించారు. రాధేశ్యామ్ లైన్ అద్భుతమైన లైన్ అని రాధేశ్యామ్ కు టైటిల్ కరెక్ట్ కాదని ఆయన వెల్లడించారు. సినిమా అనేది ప్రేక్షకులకు నచ్చడం ముఖ్యమని ఆ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులు రాధేశ్యామ్ ను చూడాలంటూ పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

పరుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్లతో నెటిజన్లు సైతం ఏకీభవిస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా బాగున్నా ఈ సినిమా ప్రభాస్ స్థాయికి తగ్గ సినిమా అయితే కాదని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ భవిష్యత్తులో ఈ సినిమా విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus