‘చెన్నకేశవరెడ్డి’ ప్లాప్ అవ్వడానికి కారణాలు ఇవే : పరిచూరి గోపాలకృష్ణ

‘ఆది’ వంటి సూపర్ హిట్ తర్వాత వి.వి.వినాయక్ డైరెక్షన్లో వచ్చిన రెండో చిత్రం ‘చెన్నకేశవరెడ్డి’. బాలకృష్ణ వంటి మాస్ హీరోతో ‘ఆది’ వంటి మాస్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సినిమా చేస్తున్నాడు అంటే… కచ్చితంగా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అంతా ఫిక్స్ అయిపోతారు. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. అలా అని ఫ్లాప్ అని కూడా అనలేము. ఓపెనింగ్స్ ను బాగా రాబట్టింది. కానీ తరువాత బాక్సాఫీస్ వద్ద డల్ అయిపోయింది. నందమూరి ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా హాట్ ఫేవరెట్ అనే చెప్పాలి. ఇదిలా ఉండగా… ఈ చిత్రంలో కొన్ని తప్పులు దొర్లాయని… అందుకే ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని.. ఒకవేళ ఆ తప్పులను కనుక సరిచేసుకొని ఉండి ఉంటే సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేదని ఈ చిత్రం రైటర్లలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

ఆయన మాట్లాడుతూ…’నా పేరు వెనుక డాక్టర్ ఉండాలన్న తన తల్లి కలను నెరవేరవేర్చే పనిలో ఈ చిత్రం పై సరిగ్గా మనసు పెట్టలేదు. చెన్నకేశవరెడ్డి చిత్రంలో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్ చాలా లేట్ గా వస్తుంది. అది పెద్ద తప్పు. ఫస్ట్ హాఫ్ లో ‘నా అన్న ఫొటో తీయొద్దని’ విలన్‌తో హీరో చెల్లెలు చెప్పి ఉంటే బాగుండేది. ముందు చిన్న బాలయ్య ఎపిసోడ్ ను నడిపి.. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ పెట్టి.. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి పాత్రను ఫైట్‌తో పరిచయం చేసి ఉంటే బాగుండేది. కానీ నేరుగా ఫైట్‌తో మొదలుపెట్టారు. అసలు అక్కడ ఫైట్ ఎందుకనేది కూడా చాలా మందికి అర్థం కాలేదు.. అంతేకాదు జడ్జితో చెప్పి చెన్నకేశవరెడ్డిని శివకృష్ణ సింపుల్‌గా రిలీజ్ చెయ్యడం కూడా కరెక్ట్ కాదు. కేసును కోర్టు వరకూ తీసుకెళ్లి లీగల్‌గానే హీరో విడుదలయ్యేలా చేసుంటే బాగుండేది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ముందే వచ్చేసి ఉంటే… హీరో రివేంజ్ ను ప్రేక్షకులు ఫీలయ్యేవాళ్ళు.

అలాగే విలన్ మోహన్ రాజ్‌ను అంత సింపుల్‌గా చంపడం కూడా బాలేదు. తన తండ్రి ఫ్లాష్ బ్యాక్ తెలిశాక కూడా చిన్న బాలయ్య రివేంజ్ ఫీలవ్వడు. న్యాయబద్ధంగా విలన్లకు శిక్ష పడేలా ప్రయత్నిస్తే బాగుండేది.. కానీ అలా లేదు. తండ్రి మీదే ఎదురు తిరగడం పెద్ద లోపం. అన్నేళ్లు భర్త కోసం ఎదురు చూసిన టబు, చిన్న కారణంతో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం… అందుకు చిన్న బాలయ్య బాధ్యుడు కావడం కూడా పెద్ద లోపం. ఈ సినిమాలో ‘‘నువ్వు రెడ్డే నేను రెడ్డే’’ అనే ఉంది. మా ఇన్నేళ్ల కెరీర్లో కులం మీద డైలాగులు రాయలేదు.. ఆ డైలాగ్ రాసింది కూడా వేరే వాళ్ళు. ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రానికి సెన్సార్ చేసిన ఓ రాయలసీమ అధికారి.. ఈ డైలాగ్ వినినప్పుడు ‘మీకు రెడ్లంటే అంత కోపమా’ అని నన్ను అడిగాడు” అంటూ చెప్పుకొచ్చాడు పరిచూరి గోపాలకృష్ణ.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus