ఈ ఏడాది థియేటర్లలో విడుదలై సక్సెస్ సాధించిన సినిమాలలో సార్ సినిమా కూడా ఒకటి. ధనుష్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చింది. చదువు గొప్పదనం తెలిపేలా ఉన్న ఈ సినిమా గురించి పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాలను పంచుకున్నారు. సార్ మూవీ చూస్తున్న సమయంలో జీవిత జ్ఞాపకాలలోకి వెళ్లానని ఆయన కామెంట్లు చేశారు. సార్ మూవీలో విద్యార్థులు అనుభవించిన కష్టాలను స్టూడెంట్ గా ఉన్న సమయంలో తాను కూడా అనుభవించానని ఆయన చెప్పుకొచ్చారు.
కొందరి జీవితాల్లోకి పరకాయ ప్రవేశం చేసి దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారని ఆయన చెప్పుకొచ్చారు. సార్ మూవీ కథను అద్భుతంగా రచించారని పరుచూరి పేర్కొన్నారు. ఈ మూవీ ద్వారా పేద విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని తెలిసేలా చేశారని ఆయన తెలిపారు. సార్ సినిమాను ధనుష్ తో తీసి వెంకీ అట్లూరి సాహసం చేశారని పరుచూరి చెప్పుకొచ్చారు. పేద విద్యార్థులకు చదువు చెప్పడం కోసం హీరో పడిన ఇబ్బందులను ఈ సినిమాలో చక్కగా చూపించారని ఆయన తెలిపారు.
ఈ కథను లైవ్ లో చూపించనట్లు చూపించి ఉంటే బాగుండేదని ఆయన (Paruchuri Gopalakrishna) అభిప్రాయం వ్యక్తం చేశారు. కొన్ని సీన్లలో ధనుష్ బాడీ లాంగ్వేజ్ సరిపోలేదని ఆయన అన్నారు. హీరోకు గురజాడ అప్పారావు గెటప్ వేయడం రైటర్ గొప్ప ఆలోచన అని పరుచూరి చెప్పుకొచ్చారు. థియేటర్ లో పాఠాలు చెప్పడం అనే కొత్త ఒరవడిని బాగా చూపించారని ఆయన తెలిపారు. సుమంత్ తో కథ చెప్పించడం బాగుందని ఆయన కామెంట్లు చేశారు.
హీరోను ఊరినుంచి వెళ్లిపోవాలని చెప్పిన సమయంలో విద్యార్థుల తల్లీదండ్రులు ఆపి ఉంటే బాగుండేదని పరుచూరి చెప్పుకొచ్చారు. పరుచూరి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. పరుచూరి గోపాలకృష్ణ రివ్యూలు పర్ఫెక్ట్ గా ఉంటాయని నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.