ఘనంగా జరిగిన యాదమ్మ రాజు పెళ్లి.. సందడి చేసిన బిగ్ బాస్ సెలబ్రిటీలు!

యాదమ్మ రాజు.. ‘పటాస్’ కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అటు తర్వాత ‘జీ తెలుగు వారు నిర్వహించిన కామెడీ షోలో కూడా కొన్నాళ్ళు కామెడీ పండించాడు. అటు తర్వాత బుల్లితెర పై అడపా దడపా కనిపించినా.. సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నాడు. పంచ్ డైలాగులను… అమాయకమైన హావభావాలతో చెప్పి నవ్వించడం ఇతని స్టైల్. యాదమ్మ రాజు పలు సినిమాల్లో కూడా నటించాడు.బుల్లితెర సెలబ్రిటీలంతా.. సొంత యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆ లిస్ట్ యాదమ్మ రాజు కూడా ఉన్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ను రన్ చేశాడు. అతని గర్ల్ ఫ్రెండ్ పేరు స్టెల్లా …! ఈ మధ్యనే ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు యాదమ్మ రాజు. నిన్న ఆదివారం నాడు వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వీరి పెళ్లి బిగ్ బాస్ సెలబ్రిటీలు సందడి చేశారు. ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్లు అయిన సోహెల్, ముక్కు అవినాష్ లు అతిథిలుగా విచ్చేసి యాదమ్మ రాజు దంపతులకు తమ బెస్ట్ విషెస్ ను తెలిపారు.

అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక యాదమ్మ రాజు హిందూ కాగా అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి స్టెల్లా క్రిస్టియన్. పెళ్లికూతురు కుటుంబ ఆచారం ప్రకారమే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం పై మొన్నామధ్య సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus