Pavala Syamala: పవన్ కళ్యాణ్ రూ.లక్ష ఇచ్చారన్న పావలా శ్యామల.. కానీ?

ప్రముఖ టాలీవుడ్ నటి పావలా శ్యామలకు గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో సినిమా ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్న పావలా శ్యామల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని టాప్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నా ఆయన పని విషయంలో అంకిత భావం చూపిస్తున్నారని పావలా శ్యామల కామెంట్లు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి కరోనా టైమ్ లో ఎంతోమందికి సాయం చేశారని నా ఆర్థిక ఇబ్బందుల గురించి తెలిసి ఆయన 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారని పావలా శ్యామల చెప్పుకొచ్చారు. నటీనటులకు ఏదైనా అన్యాయం జరిగితే చిరంజీవి ముందువరసలో ఉండి ఆ అన్యాయం గురించి మాట్లాడతారని పావలా శ్యామల కామెంట్లు చేశారు. చిరంజీవి గారిని ఒకసారి కలవాలని ఉందని పావలా శ్యామల చెప్పుకొచ్చారు. చిరంజీవిగారికి నాకు జరిగిన అవమానం గురించి చెప్పాల్సి ఉందని ఆమె కామెంట్లు చేశారు.

నాకు జరిగిన అవమానం గురించి చిరంజీవికి తెలిస్తే సహించరని పావలా శ్యామల పేర్కొన్నారు. అయితే తనను ఎవరు అవమానించారనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. కొంతమంది స్టార్ హీరోలు తనకు ఆర్థిక సహాయం చేశారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పావలా శ్యామల అన్నారు. గబ్బర్ సింగ్ మూవీ సమయంలో పవన్ లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారని చిన్న పాత్ర ఇవ్వాలని పవన్ ను కలవగా ఆయన నాకు డబ్బు రూపంలో సహాయం చేశారని ఆమె వెల్లడించారు.

పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పావలా శ్యామలను చిరంజీవి త్వరలో కలిసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకునే విషయంలో చిరంజీవి ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus