కింగ్ నాగార్జున పై షాకింగ్ కామెంట్స్ చేసిన పవిత్ర లోకేష్..!
- April 29, 2019 / 05:58 PM ISTByFilmy Focus
తల్లి పాత్రలకు పెట్టింది పేరుగా ఇప్పట్లో పవిత్ర లోకేష్ గారినే చెప్తుంటారు. ఆమెతో స్క్రీన్ చేసుకోవడానికి హీరోయిన్స్ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. ఆమె గ్లామర్ అలా ఉంటుంది. అప్పట్లో కన్నడలో హీరోయిన్ గా కుర్రకారు మనసులు కొల్లగొట్టేసిన పవిత్ర లోకేష్… ప్రస్తుతం కన్నడతో పాటు తెలుగులో చిత్రాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారిపోయారు. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రంలో ఈమె నటన చూసిన వారు.. నిజంగా తల్లిలానే ఫీలవుతారు అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా ఆ పాత్రకు ప్రాణం పోసిందావిడ. ఇక తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కింగ్ నాగార్జున పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
- అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. “నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు ‘గీతాంజలి’ సినిమా చూశాను. ఆ సినిమాలో నాగార్జునగారిని చూసిన తరువాత నా జీవితంలో కూడా ఇలాంటి మనిషి వుంటే బాగుంటుంది కదా అనిపించింది. ఒక రకంగా అది ‘ఫస్టు క్రష్’ అనుకోవచ్చు. ఆ తరువాత సినిమాల్లో ప్రకాశ్ రాజ్ ను చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది. నాగార్జునగారితో కలిసి నటించడం కుదర్లేదు కానీ.. ప్రకాశ్ రాజ్ గారితో కలిసి చాలా సినిమాల్లో నటించాను. నాగార్జునగారితో ఇంతవరకూ మాట్లాడలేదు కూడా.! ఆయన కనిపించినా మాట్లాడే ధైర్యం చేయలేదు” అంటూ ఆమె మనసులోని మాటను చెప్పుకొచ్చింది.
















