ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ అంటేనే రంగుల ప్రపంచం.. తెరమీద కనిపించే వారి జీవితాలు తెరవెనుక కూడా అంతే ఆనందంగా ఏమీ ఉండవ్.. సినిమా రంగంలో ఏదో ఒక శాఖలో తమ ప్రతిభను నిరూపించుకోవాలనుకునే ప్రతి ఒక్కరి కష్టం వెనుక బయటకి కనిపించని కన్నీటి గాథలు ఎన్నో దాగి ఉంటాయి.. వెండితెర నటీనటులు, బుల్లితెర నటీనటులు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొని నిలబడినవారే.. వారిలో ‘జబర్దస్త్’ తో పాపులర్ అయిన పవిత్ర కూడా ఉంది..
తాజాగా ఓ ఇంటర్వూలో తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిందామె.. మొదట టిక్ టాక్ వీడియోస్ చేసిన పవిత్ర.. తర్వాత జబర్దస్త్‌లో అవకాశం రావడంతో.. తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది.. కామెడీ టైమింగ్‌తో లేడీ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అక్కడి నుండి ఆమె లైఫ్ ఊహించని మలుపు తిరిగింది.. హైపవర్ ఆది, బుల్లెట్ భాస్కర్, రాకెట్ రాఘవ టీముల్లో స్కిట్స్ చేస్తూ అలరిస్తుంది.. పాగల్ పవిత్రగా పాపులర్ అయిన ఆమె జీవితంలోనూ కొన్ని బాధాకరమైన సంఘటనలున్నాయి..
వాటి గురించి పవిత్ర చెప్పుకొచ్చింది.. ‘‘మా నాన్న లారీ డ్రైవర్.. అమ్మ పొలం పనులకు వెళ్లేది.. ఇద్దరూ పని చేస్తే కానీ పూట గడవని ఫ్యామిలీ మాది.. ఒక్కోసారి మూడు పూటలు కడుపు నింపుకోవడానికి ఆలోచించేవాళ్లం.. దీనికి తోడు నాన్న తాగుడుకు బానిసయ్యాడు.. మమ్మల్ని అస్సలు పట్టించుకునే వాడు కాదు.. మా పిన్ని సాయంతో ఇంటర్ వరకు చదువుకున్నాను.. ఇంకా వాళ్లను కష్టపెట్టడం ఎందుకని చదువు ఆపేసి.. హైదరాబాద్ వచ్చి సెలూన్ పార్లర్ పెట్టుకున్నాను..
అప్పుడే అనుకోకుండా ‘జబర్దస్త్’లో అవకాశం వచ్చింది.. అదే సమయంలో సెలూన్‌కు డిమాండ్ తగ్గిపోయింది.. దాంతో సెలూన్ అమ్మేసి ఆ డబ్బుతో మా ఊళ్లోనే సొంతగా ఇల్లు కొనుక్కున్నాం.. ఇక తాగుడు కారణంగా నేను మా నాన్నతో 13 ఏళ్లు మాట్లాడలేదు.. ఆయన ముఖం చూడడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు.. ఏడాది క్రితం ఆయన చనిపోయారు.. ఆక్షణం నేను ఎంతో సంతోషంగా ఫీలయ్యాను’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది పవిత్ర..
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!