పవిత్ర పై ఆమె మొదటి భర్త సుచేంద్ర మరోసారి షాకింగ్ కామెంట్లు!

పవిత్ర లోకేష్.. నరేష్ వ్యవహారంతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల వీరిద్దరూ పెళ్లి చేసుకుని హనీమూన్ వెళ్లారంటూ వార్తలు వచ్చాయి. నిజానికి ఆ వార్తలను పుట్టించుకుంది కూడా వారే. అది ఓ సినిమా ప్రమోషన్ కోసమనే టాక్ కూడా ఉంది. అయితే పవిత్ర – నరేష్ లు సహజీవనం చేస్తున్నారు అనేది నిజం. అయితే నరేష్ కు ఆల్రెడీ 3 పెళ్లిళ్లు అయ్యాయి. పవిత్రకి కూడా రెండు పెళ్లిళ్లు అయ్యాయనే టాక్ ఉన్నా…

ఎక్కువగా మొదటి భర్త నుండే వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. అది ఎందుకు అన్నది ఎవ్వరికీ తెలీదు కానీ ఛాన్స్ దొరికిన ప్రతిసారి పవిత్ర గురించి ఘోరమైన కామెంట్లు చేస్తున్నాడు ఆమె మొదటి భర్త సుచేంద్ర ప్రసాద్. తాజాగా పవిత్ర గురించి మరోసారి షాకింగ్ కామెంట్లు చేశాడు సుచేంద్ర. ఆయన మాట్లాడుతూ.. “పవిత్రకి లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టం. ఆమె అవకాశవాది. విజయ నిర్మల గారు సంపాదించిన రూ.1500 కోట్ల ఆస్తిని నొక్కేయాలని నరేష్ ను తగులుకుంది.

అందుకే ఇద్దరు పిల్లలు.. విడాకులు తీసుకుంది. నరేష్ కు ఇంకా తెలిసి రావడం లేదు. ఏదో ఒకరోజు తనకు కూడా తెలుస్తుంది. పవిత్ర డబ్బు పిచ్చిది కూడా. అది లేకపోతే ఆమె ప్రశాంతంగా ఉండలేదు.అది ఉన్నన్నాళ్ళు నరేష్ తో ఆమె కలిసుంటుంది” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు పవిత్ర మొదటి భర్త సుచేంద్ర. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus