Pavitra Lokesh: నరేష్ తో పెళ్లి పై పవిత్రా లోకేష్ బయటపెట్టిన షాకింగ్ విషయాలు..!

సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన నరేష్.. త్వరలో ప్రముఖ నటి పవిత్రా లోకేష్‌ ను 4 వ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం గట్టిగా జరుగుతుంది. 60 ఏళ్ళ వయసులో మరో పెళ్లి ఏంటి? అంటూ ఆయన్ని విమర్శించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఈ వార్తల పై ఈ జంట ఇప్పటివరకు క్లారిటీ ఇచ్చింది లేదు.అయితే కన్నడ మీడియా జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో పవిత్రా లోకేష్ అసలు నిజాలు బయటపెట్టినట్టు తెలుస్తుంది.

పవర్ టీవీ మీడియా ప్రతినిధి తో ఆమె మాట్లాడుతూ.. వీకే నరేష్‌తో తన సహజీవనం గురించి క్లారిటీ ఓపెన్ అయ్యిందట. ‘నన్ను తమ కుటుంబ సభ్యురాలిగా నరేష్ ఇంట్లో వాళ్లు అంగీకరించారు. మా ఇద్దరి సహజీవనం, రిలేషన్‌షిప్‌కు సూపర్ స్టార్ కృష్ణ, ఆయన ఫ్యామిలీ ఆమోదం తెలిపింది. అందుకే మేము పెళ్లి చేసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నాం. ఫామ్‌హౌస్‌లో కృష్ణ, నరేష్, మేము కలిసి ఉంటున్నాం. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సరిగ్గా ఉంటే.. నరేష్ కుటుంబం ఆమె వెంట ఉండేది.

ఆమెను నేను దూరంగా ఉండి చూశాను. ఆమె తీరు, ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చలేదు. నా భర్తతో కలిసి ఉండనని ఆమె చెప్పింది. అలా ఆమె జీవితంలో సమస్యలు తలెత్తాయి. నా భర్తగా చెప్పుకుంటున్న, కన్నడ దర్శకుడు సుఖేంద్ర ప్రధాస్‌ ను నేను పెళ్లి చేసుకోలేదు. మాకు అధికారికంగా పెళ్లి జరగలేదు. మేము సహజీవనం లో ఉన్న మాట వాస్తవం. కొన్నాళ్లు కలిసున్నాం. మాకు పెళ్ళైతే కాలేదు. అలాంటప్పుడు విడాకుల అవసరం ఏముంది.

మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పటికీ సుఖేంద్ర కుటుంబ సభ్యులు నాతో సన్నిహితంగా ఉంటారు. మహేష్ బాబు తండ్రి కృష్ణ, మరియు అతని కుటుంబం నాతో ఉంది. నేను సంతోషంగా ఉన్నాను, నరేష్ జీవితంలో నాకు చోటు ఉంటే చాలు. నాకు ఎలాంటి డిమాండ్స్ లేవు. నరేష్ భార్య రమ్య వ్యక్తిగత జీవితంలోకి నేను తలదూర్చను. అవసరమైతే నరేష్, ఆమెతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాను’ అంటూ పవిత్ర లోకేష్ అసలు మేటర్ ను బయటపెట్టింది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus