నటి పవిత్ర లోకేష్ పరిచయం అవసరం లేని పేరు.టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా భారీగా ట్రెండ్ అవుతున్నటువంటి ఈమె తాజాగా నటుడు నరేష్ తో కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లేటు వయసులో వీరిద్దరూ ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలోనే మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ గా నిలిచారు.
ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది.ఇలా ఈ సినిమా ద్వారా నరేష్ పవిత్ర లోకేష్ మరింత పాపులారిటీ సంపాదించుకున్నారని చెప్పాలి. ఈ సినిమా అనంతరం ఈమెకు పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తుంది. ఇలా పవిత్ర లోకేష్ కెరియర్ పట్ల ఎంతో బిజీగా మారబోతున్నారని తెలుస్తోంది. అయితే పవిత్ర లోకేష్ కెరియర్ గురించి పక్కన పెడితే ఈమె తాజాగా తీసుకున్నటువంటి ఓ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అన్ని భాషలలోను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నటువంటి పవిత్ర లోకేష్ తాజాగా తన మాతృభాష అయినటువంటి కన్నడ సాహిత్యంలో పీహెచ్ డీ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ క్రమంలోనే పీహెచ్డీ ప్రవేశ పరీక్ష రాయడం కోసం ఈమె బళ్లారికి వెళ్లారు. ఇక పవిత్ర ఈ ప్రవేశ పరీక్ష రాయడానికి వెళుతూ ఉండగా నరేష్ దగ్గరుండి ఆమెను బళ్ళారి తీసుకెళ్లి తన చేత పరీక్ష రాయించారు.
ఈ క్రమంలోనే పవిత్ర (Pavitra Lokesh) హంపి కన్నడ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశ పరీక్షను రాశారు.దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది పవిత్ర లోకేష్ పై ప్రశంసలు కురిపించారు. ఇలా మాతృభాష అయినటువంటి కన్నడ భాషా సాహిత్యంలో ఈమె పిహెచ్ డీ చేయాలనే నిర్ణయం తీసుకోవడం చాలా గ్రేట్ అంటూ పవిత్ర పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.