పవన్ జోడు గుర్రాల మీద స్వారీ చేయగలడు!

మరో మూడు సినిమాల తర్వాత తను భవిష్యత్తులో ఏం చేస్తానో చెప్పలేకపోతున్నానని పవన్, చిరుతో అన్నారట. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని సభా ముఖంగా చెప్పారు చిరంజీవి. ఈ మధ్యన నేను విన్నాను. పవన్ కూడా చెప్పాడు. పవన్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు.

ఎన్నో జన్మల పుణ్యఫలంతోనే ఇంత మంది అభిమానులను సంపాదించుకున్నాం. వారిని నొప్పించకడం సరి కాదు. చిన్నన్నప్పుడు నేను చెప్పిన మాట విని ఎలా యాక్టర్ అయ్యావో.. ఇప్పుడు మరోసారి నా సలహా వింటావని.. నా మాట కాదనవనే అనుకుంటున్నాను. నీకు జోడు గుర్రాల మీద స్వారీ చేయగలిగిన కెపాసిటీ ఉంది. నువ్వు వేరే రంగంలో కూడా రాణించగలవు. అంత మాత్రం చేత ఈ పరిశ్రమను దిదిచి పెట్టాల్సిన అవసరం లేదని చిరంజీవి స్పష్టం చేశారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus