ఆగ్రహంతో సెట్స్ నుంచి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్
- October 26, 2016 / 06:37 AM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోరు. తిక్క పుట్టిందంటే ఎంతటి వారినైనా ఎదుర్కొంటారు. మొహం మీదే అడిగేస్తారు. ఈ తత్వం ఆయనకు టీనేజ్ నుంచి ఉంది. ఈ మధ్య జనసేన పార్టీకి అధినేత కావడంతో ఆచితూచి మాట్లాడుతున్నారు. సహనం, సంయమనం పాటిస్తున్నారు. అలా చాలా మారిన పవన్ కళ్యాణ్ కి కాటమరాయుడు చిత్ర బృందం కోపం తెప్పించింది. డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ మూవీ సికింద్రాబాద్ లో వేసిన భారీ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. సోమవారం షూటింగ్ కి హాజరైన పవర్ స్టార్ కి ఆరోజు యాక్షన్, డైలాగ్ పేపర్ ని డైరక్టర్ టీమ్ అందించలేదు.
మధ్యాహ్నం అవుతున్నా షూటింగ్ మొదలు కాకపోవడంతో కోపంతో సెట్స్ లోకి వచ్చిన పవన్ ఆగ్రహంతో డైరక్టర్ పై అరిచారు. ఈరోజు సీన్ ఏమిటి, అందులో నటించే వారెవరు వాటన్నింటినీ సరిగ్గా ప్లాన్ చేయకుండా సమయాన్ని వృథా చేశారని డాలీపై ఆవేశంగా మాట్లాడి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు. ఈ సినిమాను అత్యంత వేగంగా పూర్తి చేసి మరో రెండు చిత్రాలను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని పవన్ భావిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 29 న రిలీజ్ అవుతుందని ప్రకటించారు కూడా. ఇలాంటి సమయంలో డైరక్టర్ చురుకుగా లేకపోవడంతో పవన్ కళ్యాణ్ ఆవేశపడ్డారని ఆయన సన్నిహితులు చెప్పారు. మంగళవారం నుంచి కాటమరాయుడు షూటింగ్ యధావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.

















