మెగాస్టార్ చిరంజీవిని అమితంగా అభిమానించే వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు ఉంటారు. ఈ విషయాన్ని ఆయన మరో సారి స్పష్టం చేశారు. లండన్లో జరిగిన యుక్తా (UKTA-యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్) 6వ వార్షికోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. ఈస్ట్ లండన్ లోని ట్రాక్సీ థియేటర్లో శనివారం గ్రాండ్ గా నిర్వహించారు. దాదాపు 2 వేల మంది తెలుగు వారు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు.
ఈ వేడుకల అనంతరం పవర్ స్టార్ ఎన్నారై లతో సమావేశమయ్యారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్బంగా తన అన్నయ్య చిరంజీవి గొప్పదనాన్ని గుర్తుచేకున్నారు. “మాది ఓ మధ్య తరగతి కుటుంబం. మాకు ఓ రోజు సినిమాకు వెళ్లడమంటే అదే పెద్ద పండగ. అటువంటిది సినిమాలో నటించాలి అని థాట్ రావడమే కష్టం. కానీ అన్నయ్య నటుడిగా మారాలని కలలు కని, కష్టపడి .. ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఓ స్టేజ్ కి వచ్చారు. అలా ఒక రంగంలో సొంతకాళ్ల మీద నిలబడాలంటే చాలా గ్రేట్.
అందుకే అన్నయ్య అంటే నాకు చాలా గౌరవం” అని పవన్ చెప్పారు. ” నాకు అడ్డు తగిలిన వారిపై ఎప్పుడూ కోపగించుకోను.. మరింతగా ఎదగడానికి, మన టాలెంట్ ని పెంచుకోవటానికి వారు సహాయపడ్డారని సంతోషిస్తాను. ఇది కూడా అన్నయ్య నుంచే నేర్చుకున్నాను” అని పవర్ స్టార్ మెగా స్టార్ గురించి వెల్లడించారు.