ఏపీలో మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. రాష్ట్రంలో పోటీ చేస్తున్న అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ ను ప్రదర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్లడిస్తున్న విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. నా భార్య విదేశీయురాలు అని ఆమెది ఈ దేశం కాదని ఆమెను కూడా తిట్టారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. నా భార్యకు రాజకీయాలు తెలియవని ఆయన చెప్పుకొచ్చారు.
నా భార్య ఎందుకిలా ఇంట్లో ఉండేవాళ్లని తిడతారని అడిగిందని భయపడిందని ఇబ్బంది పడిందని వాళ్లు తిట్టిన తిట్లకు క్షమించాలని నా భార్యను నేను క్షమాపణలు కోరానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మే 13వ తేదీన పిఠాపురంకు నువ్వు వస్తే నేనెందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నానో అర్థం అవుతుందని నా భార్యకు చెప్పానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మొన్న సాయితేజ్ (Sai Dharam Tej) వస్తే సాయితేజ్ పై గాజు బాటిల్ విసిరేశారని సాయితేజ్ తలకు ఆ బాటిల్ తగిలి ఉంటే ఏమయ్యేదో తెలియదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఆ బాటిల్ వల్ల మరో పార్టీ నేతకు దెబ్బ తగిలిందని ఆ నేత త్వరగా కోలుకోవాలని పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో జనసేన పార్టీని గెలిపించుకుంటానని పవన్ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో చూడాలి.
ఈ ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా చాటి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది. ఏపీ ఎన్నికలు ఇతర రాష్ట్రాలలో సైతం హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. సర్వే సంస్థలకు సైతం ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి విజయం దక్కుతుందో తెలియడం లేదు.