చిరంజీవి సవాల్ ని స్వీకరించిన పవన్ కళ్యాణ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మెగాస్టార్ చిరంజీవి మాట చెప్పడమే తరువాయి చేసి చూపిస్తాడు. ఆలస్యం చేయరు. అన్నంటే పవన్ కి అంత గౌరవం. అది నిజమని తెలిపే సంఘటన ఈరోజు మరొకటి జరిగింది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి (ఈ నెల 27) ని పురస్కరించుకొని ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ “హరితహారంలో భాగంగా ఈ గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా హరితహారం ఛాలెంజ్ సెలబ్రిటీల చుట్టూ తిరుగుతోంది.

రాజమౌళి, మహేష్ బాబు తదితరులు మొక్కలునాటారు. ఇందులో భాగంగా ఎన్టీవీ నరేంద్ర చౌదరి మెగాస్టార్ చిరంజీవికి గ్రీన్ చాలెంజ్ విసిరారు. చిరు సైరా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ ఛాలెంజ్ ని స్వీకరించారు. ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి మొక్కలు నాటి… బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. అన్న సవాల్ విసరడమే తరువాయి.. వెంటనే పవన్ రంగంలోకి దిగారు. మొక్కలు నాటారు. ఇలా సినీ స్టార్లు హరితహారంలో భాగం కావడం మంచి పరిమాణమని పర్యావరణ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులందరూ మొక్కలునాటి పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus