పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాలో నటించి మీరా చోప్రా నటిగా మంచి పేరును సంపాదించుకున్నారు. కరోనా వల్ల ఎంతోమంది సెలబ్రిటీల కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకోగా మీరాచోప్రా ఫ్యామిలీలో సైతం కరోనా వల్ల విషాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన మీరాచోప్రా ఫ్యామిలీలో కేవలం 7 రోజుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సరైన సమయంలో బెడ్ దొరకకపోవడం,
మందులు దొరకకపోవడం వల్లే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతూ ఉండగా గత నెల 29వ తేదీన మీరాచోప్రా కజిన్ సరైన సమయంలో బెడ్ లభించకపోవడంతో ఊపిరితిత్తులు పాడై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన వారం రోజులకు మీరాచోప్రా మరో కజిన్ చనిపోయారు. వరుసగా ఇద్దరు కజిన్స్ చనిపోవడంతో మీరాచోప్రా ఎమోషనల్ కావడంతో పాటు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఆస్పత్రులలో తాను జీఎస్టీ చెల్లించబోనని ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నా బెడ్ దొరకకపోతే జీఎస్టీ ఎందుకు చెల్లించాలని ఆమె ప్రశ్నించారు.
ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించి ఉంటే తన కజిన్స్ ప్రాణాలు కోల్పోయే వాళ్లు కాదని ఆమె పేర్కొన్నారు. తక్కువ సమయంలో ఇద్దరు కజిన్స్ చనిపోవడంతో మీరాచోప్రా తన ఆవేదనను ఈ విధంగా వెళ్లగక్కారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు సెలబ్రిటీలకే ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతుండటంతో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం గమనార్హం.