Pawan Kalyan: మళ్ళీ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం పై ట్రోలింగ్ !

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ టూర్లలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కోనసీమలో తన వారాహి పై పర్యటిస్తుండటం.. అక్కడ జనాల మధ్య ప్రసంగించడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో వైసీపీ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ పై పర్సనల్ అటాక్ చేయడం వంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి. పవన్ పై పర్సనల్ అటాక్ అంటే… ఏముంటుంది? ఆయన మూడు పెళ్లిళ్ల వ్యవహారం. అలాగే గతంలో పరిటాల రవి .. పవన్ కి గుండు కొట్టించాడు అని చెప్పడం.

మూడు పెళ్లిళ్ల విషయంలో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ‘తాను ఒకేసారి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని.. అసలు పెళ్లే చేసుకునే ఉద్దేశం తనకి లేదని, పరిస్థితులు అలా వచ్చాయని.. ఒకేసారి మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేనని’ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. దివంగత సీనియర్ జర్నలిస్ట్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన కత్తి మహేష్ కూడా పవన్ కళ్యాణ్ ని ఈ విషయంలో టార్గెట్ చేసి నెగిటివ్ కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఆ టైంలో ఓ టీవీ ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తున్న లహరి.. ఓ డిబేట్ లో కత్తి మహేష్, దర్శకుడు వివేక్ పాల్గొన్నప్పుడు .. ‘కత్తి మహేష్ ను మీ అమ్మ గురించి చెప్పమని’ వివేక్ తో కలిసి లహరి కూడా అడగడం జరిగింది. ఆ టైంలో కత్తి మహేష్ స్టూడియో నుండి వెళ్లిపోవడం కూడా మనం చూశాం. ఆ టైంలో లహరి పెద్ద సెలబ్రిటీ అయిపోయింది.అప్పటికే ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటించినా రాని క్రేజ్.. పవన్ ఫ్యాన్స్ వల్ల ఆమెకి లభించింది.

స్వతహాగా (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన లహరి .. ఆ తర్వాత ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ ని కలిస్తే.. ‘పవన్ కి నాలుగో భార్య లహరి’ అంటూ ఘోరమైన ప్రచారం చేశారట. ఈ విషయం పై కూడా స్పందించి ఆమె వాపోయింది. కవరేజ్ కోసం వెళ్తే.. తనని నాలుగో భార్యని చేసారని లహరి తెలిపింది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus