పవన్ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది!
- June 3, 2016 / 06:31 AM ISTByFilmy Focus
“సర్దార్ గబ్బర్ సింగ్” లాంటి డిజాస్టర్ అనంతరం తన అభిమానులు మరియు తన సినిమా పుణ్యమా అని భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ల కోసం నెల తిరక్కుండానే మరో కొత్త సినిమా ప్రారంభించిన పవన్ కళ్యాణ్, సదరు సినిమా షూటింగ్ ను మాత్రం స్టార్ట్ చేయలేదు. జూన్ 2 నుంచి పొల్లాచ్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అనే వార్తలు వచ్చినప్పటికీ.. ఇప్పటివరకూ ఆ ఊసే లేదు.
దీంతో పవన్ కళ్యాణ్ ది కేవలం “ఆరంభ శూరత్వం” అని యాంటీ ఫ్యాన్స్ దెప్పిపొడుస్తుంటే.. ఎటువంటి సమాధానం చెప్పాలో తెలియక పవర్ స్టార్ అభిమానులు తలదించుకొంటున్నారు. పవన్ కళ్యాణ్ తన ట్రిప్ ముగించుకొని త్వరగా ఇండీయా వచ్చేసి.. “హుషారు” (వర్కింగ్ టైటిల్) చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించాలని ఆశిద్దాం!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















