Pawan Kalyan: మా దగ్గరకు రావాల్సింది హీరోలు కాదు.. వాళ్లు వస్తేనే మాట్లాడతాం!

రీసెంట్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి టాలీవుడ్‌ సినిమా పెద్దలు, హీరోలు కలిశారు. పరిశ్రమ బాగు కోసం, ప్రపంచ ఖ్యాతి కోసం కష్టపడాలి, పడదాం అని మాట్లాడారు. కొన్నేళ్ల క్రితం ఈ పరిశ్రమ పెద్దలు ఆంధ్రప్రదేశ్‌ అప్పటి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని కూడా ఇదే తరహాలో టాలీవుడ్‌ హీరోలు, నిర్మాతలు, దర్శకులు కలిశారు. ఇప్పుడు ఈ టాపిక్స్‌ ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ విషయం గురించి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) మాట్లాడారు కాబట్టి.

Pawan Kalyan

రామ్‌చరణ్‌ (Ram Charan) – శంకర్‌ (Shankar)    – దిల్ రాజు (Dil Raju) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’(Game Changer). ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విచ్చేశారు. ఈ క్రమంలో ఆయన ఇండస్ట్రీ గురించి, ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం గురించి వివరంగా మాట్లాడారు. ఈ క్రమంలో ఆసక్తికర సూచన చేశారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని అంటున్నాం.

కానీ భారతీయ చిత్ర పరిశ్రమ అనేదే మన నినాదం. మనం హాలీవుడ్‌లోని ముఖ్యమైన, కీలకమైన పద్ధతులు పాటించకపోయినా ‘వుడ్’ అనే పదాన్ని మాత్రం తీసుకున్నాం అని చెప్పారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ రావాలి అని కోరారు. ఆ తర్వాతనే అసలు కామెంట్స్‌ వచ్చాయి ఆయన నుండది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలంటే సినిమాలు తీసే వాళ్లే మాట్లాడాలి. సినిమాలు తీసే వాళ్లతోనే ప్రభుత్వం తరఫున మేం మాట్లాడుతాం.

సినిమా తీయనివాళ్లకు సినిమాల గురించి ఏం అవసరం. అంతేకాదు సినిమా టికెట్ ధరల విషయంలో హీరోలతో పనేంటి? ఈ విషయాన్ని నిర్మాతలు రావాలి. లేదా ట్రేడ్‌ యూనియన్లు రావాలి అని చెప్పారు. అంతేకానీ హీరోలు వచ్చి నమస్కారాలు పెట్టాలని కోరుకునేంత కిందిస్థాయి వ్యక్తులం మేం కాదు. ఎన్టీఆర్ (Sr NTR) రాజకీయాలతో సంబంధం లేకుండా తోటి నటులను గౌరవించేవారు. ఇప్పుడు మేమూ అలాగే ఉంటున్నాం అని అన్నారు. అయితే పవన్‌ తన మాటల్లో ఎక్కడా నమస్కారం పెట్టించుకున్న వ్యక్తుల పేర్లు ప్రస్తావించకపోవడం గమనార్హం.

మా ఫ్యామిలీ అలా అవ్వాలని అనుకున్నా.. పవన్‌ గుర్తు చేశాడు: చిరు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus