Bheemla Nayak: కోపిష్టి పోలీసోడిగా కల్యాణ్ బాడీ లాంగ్వేజ్ అదుర్స్

“వకీల్ సాబ్”తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రీమేకుల మీద ఆధారపడిపోయాడు. తన 25 సినిమాల కెరీర్ లో దాదాపుగా 9 రీమేక్ సినిమాల్లో నటించిన పవన్.. ఇప్పుడు పదో రీమేక్ లో నటిస్తున్నాడు. మలయాళంలో ఘన విజయం సొంతం చేసుకున్న “అయ్యప్పనమ్ కౌశియమ్” రీమేక్ లో పవన్ కళ్యాణ్-రాణా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2022కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ చిత్రం టీజర్ ను 75వ స్వాతంత్రదినోత్సవ కానుకగా నేడు విడుదల చేశారు చిత్ర బృందం.

ఈ చిత్రానికి “భీమ్లా నాయక్” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కోపిష్టి పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ అదిరిందనే చెప్పాలి. ఐశ్వర్య రాజేష్, నిత్యామీనన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకుడు కాగా త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత సారధ్యం వహిస్తున్నాడు. ఇక టీజర్ విషయానికి వస్తే.. “రేయ్ డానీ బయటకి రారా నా కొడకా” అని పవన్ కళ్యాణ్ పొగరుగా చెప్పే డైలాగ్ పవన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేయడం ఖాయం. అలాగే.. చివర్లో “భీమ్లా.. భీమ్లా నాయక్.

ఏంటి చూస్తున్నా..కింద క్యాప్షన్ లేదనా అక్కర్లేదు బండెక్కు” అని తెలంగాణా యాసలో చెప్పే డైలాగ్ చాలా సబ్టల్ గా ఉంది. పవన్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. అయితే.. మల్టీస్టారర్ ప్రొజెక్ట్ ను ఇలా సింగిల్ హీరో సెంట్రిక్ సినిమాలా ప్రొజెక్ట్ చేయడమే కాస్త బాలేదు. ఇదే టీజర్ లో రాణా కూడా కనిపించి ఉంటే ఒరిజినల్ వెర్షన్ కి జస్టీఫికేషన్ లా ఉండేది. ఆ విషయాన్ని త్రివిక్రమ్ & టీం ఎందుకు వదిలేశారో అర్ధం కాలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను సంతుష్టులను చేయడమే కాక.. కథను జస్టిఫై చేయడం చాలా ముఖ్యమనే విషయాన్ని సాగర్ కె.చంద్ర అర్ధం చేసుకుంటే బాగుంటుంది. ఓవరాల్ గా టీజర్ మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను పూనకాలు తెప్పించే విధంగా ఉంది.


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus