పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలోపున సాధ్యమైనన్ని చిత్రాలు పూర్తి చేయాలనీ ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలోకి దిగుతుండడం, పవన్ కూడా ఎంఎల్ ఏ పోటీ చేయడం ఫిక్స్ కావడంతో ఆ ఏడాది మొత్తం పవన్ సినిమాలకు దూరం అవుతారు. అందుకే అప్పటికే నాగుగైదు చిత్రాలను కంప్లీట్ చేయాలనీ పక్కాగా ప్రణాళిక రచించుకుంటున్నారు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్న పవర్ స్టార్, దీని తర్వాత చేయనున్న రెండు ప్రాజక్టులకు ఒకే చెప్పారు. కాటమరాయుడు చిత్రాన్ని ఫిబ్రవరికి పూర్తిచేసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీని పట్టాలెక్కించాలని అనుకున్నారు. కానీ పార్టీ మీటింగ్స్, ప్రజల సమస్యలపై పోరాటం వల్ల షూటింగ్ లేటయింది. కాబట్టి ఏప్రిల్ నుంచి ఈ మూవీ మొదలెట్టనున్నారు.
త్రివిక్రమ్ సినిమాని ఎలాగైనా అక్టోబర్ నాటికి కంప్లీట్ చేసి తమిళ దర్శకుడు ఆర్ టీ నేసన్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ చిత్రాన్ని వెనక్కి పంపించి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో సినిమాని ముందుగా కంప్లీట్ చేయాలనీ భావిస్తున్నట్లు తెలిసింది. దీని తర్వాత నేసన్ ఉంటుందని సమాచారం. ఈ షెడ్యూల్ మార్పునకు బడ్జెట్ కారణమని టాక్. ఏ విషయంలోనూ బడ్జెట్ పరంగా షూటింగ్ కి ఆలస్యం జరగకూడదని భావించి పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. సో ఈ ఏడాది కాటమరాయుడుతో పాటు త్రివిక్రమ్ కంప్లీట్ కాగా, తర్వాతి ఏడాది ఏఏం రత్నం, మైత్రి మూవీ మేకర్స్ వారి సినిమాలు పూర్తి కానున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.