2024 ఎన్నికలకు మరో 14 నెలల సమయం ఉండగా మరికొన్ని నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. 2024 ఎన్నికల్లో పవన్ కు అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈరోజు వారాహి వాహనానికి పూజలు చేయించిన పవన్ పొత్తుల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారాహి అంటే దుష్టులను శిక్షించేదని పవన్ చెప్పుకొచ్చారు.
కొండగట్టు ఆంజనేయస్వామితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఈ రీజన్ వల్లే ఇక్కడ ప్రత్యేక పూజలు చేశానని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. పూజల అనంతరం పవన్ కళ్యాణ్ వాహనాన్ని ప్రారంభించారు. తన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండే పార్టీలతో పొత్తు విషయంలో ముందుకెళతానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పొత్తులు కుదరని పక్షంలో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమేనని పవన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదని తన ఆలోచన అని పవన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తనకు పునర్జన్మనిచ్చిందని పవన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పోటీ చేసే అవకాశం ఉందని ఆయన కామెంట్లు చేశారు. పవన్ వీక్ డేస్ లో సినిమా షూటింగ్ లలో పాల్గొంటుండగా వీకెండ్ లో మాత్రం రాజకీయాలకు పరిమితమవుతున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది.
పవన్ కళ్యాణ్ సినిమాల్లో సంచలనాలు సృష్టించిన విధంగానే రాజకీయాల్లో కూడా సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజకీయాల్లో పవన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది. గాజువాక లేదా కాకినాడ రూరల్ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. పవన్ పోటీ చేసే నియోజకవర్గానికి సంబంధించి త్వరలో పూర్తిస్థాయి స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది.