Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బీజేపీ నాయకుల వైఖరి బాధ కలిగిస్తోంది : పవన్ కళ్యాణ్

బీజేపీ నాయకుల వైఖరి బాధ కలిగిస్తోంది : పవన్ కళ్యాణ్

  • January 27, 2017 / 06:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బీజేపీ నాయకుల వైఖరి బాధ కలిగిస్తోంది : పవన్ కళ్యాణ్

ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పుడు మాట ఇచ్చి.. ఇప్పుడు రోజుకో మాట మాట్లాడుతున్న బీజేపీ నాయకుల వైఖరి బాధ కలిగిస్తోందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. “బీజేపీకి మద్దతిస్తున్నప్పుడు నాకు రాజకీయ అనుభవం ఉందా? అని ఏ బీజేపీ నాయకుడు అడగలేదు. ఆనాడు ఈ ప్రశ్నను సిద్ధార్థ నాథ్ సింగ్ అడగలేదు. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు నన్ను తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు తిప్పారు. బతిమిలాడి తెలంగాణ అంతటా పర్యటనలకు పంపారు. ఎన్నికల ముందు ప్రచారానికి అవసరం లేని రాజకీయ అనుభవం నేడెందుకు?” అంటూ ప్రశ్నించారు.”రాజకీయాల్లో నాకు ఏబీసీడీలు తెలియవని.. నేర్చుకుని రమ్మంటున్నారు. ఇంతకు మించిన అవకాశవాదం ఇంకేముంటుంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. మూడేళ్ల కాలంలో నేను ప్రభుత్వాలను ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదు. అన్నీ రూల్ బుక్ ప్రకారం జరగాలంటే కుదరదన్న సంగతి నాకు తెలుసు. అందుకే తగినంత సమయం ఇవ్వాలని భావించా.” అని వివరించారు. ఇంకా పవన్ ఏమన్నారంటే..?

అన్ని పార్టీలు అవే చేశాయి.. నోట్ ఫర్ ఓట్ లో కూడా నేడు ఆనాడే మాట్లాడేవాడిని, కానీ ప్రజా సమస్యలు వెనకపడతాయని చూసి చూడనట్లు వ్యవహరించా.. తెలియక కాదు. పైగా తెలుగుదేశం పార్టీ మాత్రమే తొలిసారిగా అలా చేసుంటే బలంగా అడిగేవాడిని, కానీ అంతకు ముందు చాలా పార్టీలు అవే చేశాయి. అందుకే ప్రజల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వానికి అండగా నిలబడాలనే ఆ విషయంపై కావాలనే స్పందించలేదు.

చిక్కులే మిగిలాయి.. గత మూడేళ్లూ దేశం సమస్యల్లో చిక్కుకుపోవడం మినహా మరేమీ లాభాలను పొందలేదు. అటు నరేంద్ర మోదీ, ఇటు చంద్రబాబులు ఒంటెద్దు పోకడలకు పోతున్నారు. పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ గొడవలు, రోహిత్ వేముల ఘటన, నోట్ల రద్దు వంటి ఎన్నో సమస్యలు దేశాన్ని పట్టి పీడించాయి. ప్రతి విషయంలోనూ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు. నేను బీజేపీని, ఆ పార్టీ నాయకులను ఎంత అర్థం చేసుకుందామని అనుకున్నా, మింగుడు పడట్లేదు. వారు అనుకున్నది చేస్తున్నారే తప్ప, ప్రజల మనోభావాలను గురించి పట్టించుకోవడం లేదు. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజల సమస్యలను పట్టించుకోలేదనే కొత్తపార్టీకి అవకాశం ఇద్దామని టీడీపీ- బీజేపీకి మద్దతు ఇచ్చా. ఎన్నికలకు ముందు ఆశలు కల్పించి ఇప్పుడు కుంటిసాకులు చెప్పడం తగదు.

నమ్మకాన్ని నిలుపుకోండి.. రాజకీయ నాయకులు అధికారంలో లేనప్పుడు ఒకలా అధికారం ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు. మీరు సన్మానాలు చేయించుకోవచ్చు. ఏదైనా చేయించుకోండి. కానీ నమ్మకాన్ని నిలుపుకోండి. భిన్న మతాలు, కులాలను గౌరవించకుండా ప్రభుత్వాలను నడపలేరు. ప్రజా సమస్యల పరిష్కారంలో టీడీపీ, బీజేపీ మాట మార్చాయి. బీజేపీ నాయకులు వైఖరి బాధ కలిగిస్తోంది. ప్రజల మనోభావాలను వారు లెక్కలోకి తీసుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ప్రజలను చులకన చేసి వెంకయ్యనాయుడు మాట్లాడడం సరికాదు. స్వర్ణ భారత్ ట్రస్ట్ పై పెట్టిన మనసు ఏపీపై పెడితే ప్రత్యేక హోదా వస్తుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BJP Party
  • #janasena
  • #Janasena Party
  • #Janasena Prasthanam
  • #pawan kalyan

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

5 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

6 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

7 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

11 hours ago

latest news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

11 seconds ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

6 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

7 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

7 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version