పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల అమ్మాయి ఆద్య యాక్టింగ్ లో ఇరగదీసింది. కేవలం నిమిషం కూడా లేని వీడియోలో డ్యూయల్ రోల్ చేసి మెస్మరైజ్ చేసింది. మంచి హ్యూమర్ తో కూడిన ఆ క్యూట్ వీడియోలో ఆద్య డాక్టర్ మరియు పేషెంట్ రోల్స్ చేసింది. మరో విశేషం ఏమిటంటే ఆ స్కిట్ రాసింది, డైరెక్ట్ చేసింది మరియు ఎడిట్ చేసింది ఆద్యనే అట. చిన్న వయసులోనే తన కూతురు దగ్గర ఉన్న మల్టీ టాలెంట్స్ ని తెలియజేస్తూ రేణూ దేశాయ్ ఆ వీడియో తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
ఆద్య యాక్టింగ్ స్కిల్స్ చూస్తుంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా త్వరలో ఎంట్రీ ఖాయం అనిపిస్తుంది. లేదా ఆద్య భవిష్యత్ లో ఓ మంచి లేడీ డైరెక్టర్ అయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి ఫ్యాన్స్ తెగ ముచ్చట పడిపోతున్నారు. యాక్టింగ్లో తండ్రికి తగ్గ తనయ అంటూ పొగిడేస్తున్నారు. ఇక రేణు దేశాయ్ కి ఇద్దరు పిల్లలు కాగా కొడుకు అకీరా వయసు 16. టీనేజ్ కూడా దాటకుండానే అకీరా ఎత్తు 6’4′ అంగుళాలకు చేరింది.
త్వరలో పవన్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరో వైపు రేణు దేశాయ్ కూడా సినిమాలలో నటిగా సెటిల్ అవ్వాలనే ప్లాన్స్ లో ఉన్నారు. ఆమె వయసు తగ్గ పాత్రలతో పాటు హీరో మదర్ రోల్స్ కూడా చేస్తాను అనడం గమనార్హం. ఆమెకు సూపర్ స్టార్ మహేష్ కి అమ్మ పాత్ర చేయాలని ఉందని.. చెప్పి సంచలనం రేపారు. ఆమెకు ఉన్న క్రేజ్ రీత్యా టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసే సూచనలు కలవు.
View this post on Instagram
#PawanKalyan #Renudesai daughter #Aadhya’s a hidden talent 👏👏
A post shared by Filmy Focus (@filmyfocus) on
Most Recommended Video
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!