Pawan Kalyan, Jr NTR: తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన పవన్.. అలా చెప్పడంతో?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హృతిక్ రోషన్ (Hrithik Roshan) సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోషల్ మీడియా ద్వారా తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా ఆ విషయం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

“ప్రముఖ కథానాయకుడు శ్రీ ఎన్టీఆర్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆస్కార్ పురస్కారాలు అందుకున్న “ఆర్.ఆర్.ఆర్” (RRR) సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రియుల మెప్పు పొందారు. తనదైన అభినయం, డ్యాన్స్ తో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణమైన సంతోషాన్ని పొందాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని పవన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు మ్యుచువల్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. రామ్ చరణ్ (Ram Charan) , మహేష్ బాబు (Mahesh Babu) , అల్లు అర్జున్ (Allu Arjun) కూడా తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఫోటోను పంచుకుంటూ రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయడం గమనార్హం. అక్టోబర్ 10వ తేదీన దేవర సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

దేవర (Devara) సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. ఎన్టీఆర్ ఎక్కువ రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్న సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం. యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు సైతం నచ్చేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus