పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. ఏప్రిల్ 8 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ చిత్ర విడుదలను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల పవన్ అభిమాన సంఘాలు.. పవన్ అభిమానులకు ఓ విజ్ఞప్తి చేస్తున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల రోజున ఎవరూ కూడా పవన్ కటౌట్లకు పాలాభిషేకాలు చేయవద్దని, పాలను వృధా చేయకుండా వాటిని అనాథ పిల్లలకు మరియు పేద ప్రజలకు పంపిణీ చేయాలని పిలుపునిచ్చాయి. అంతేకాకుండా ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రతి జిల్లా, ప్రతి మండలంలో చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బెంగుళూరు లో మణివణ్ణన్ అనే సామాజిక కార్యకర్త.. రజినీకాంత్ చిత్ర విడుదల సమయంలో పాలాభిషేకాలు మానుకోవాలని కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో పవన్ అభిమాన సంఘాలు ఇలా పిలునిచ్చారు. కాగా బాబీ దర్శకత్వంలో పవన్ సరసన కాజల్ జంటగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మించారు. విడుదలకు ముందే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.100 కోట్లు దాటి పోవడంతో.. ఈ చిత్రంపై సినీ ప్రేక్షకులల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.