త్రివిక్రమ్ కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ ను అయోమయంలో పడేసిన వేళ!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటాయి ఆయన సినిమాలు. ముఖ్యంగా ఆలోచింప చేసే, అలాగే గుర్తుండి పోయే సంభాషణలు కూడా ఉంటాయి. అందుకే త్రివిక్రమ్ సినిమాలను రిపీటెడ్ గా చూస్తుంటారు ప్రేక్షకులు. కేవలం సినిమాల్లోనే కాదు.. సినిమా వేడుకల్లో కూడా త్రివిక్రమ్ స్పీచ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. స్కూల్లో పాఠాలు కూడా అంత ఇంట్రెస్టింగ్ గా వింటారో లేదో కానీ.. నిజజీవితంలో త్రివిక్రమ్ స్పీచ్ లను మాత్రం తెగ వింటుంటారు కొంతమంది యువత.

అంతేకాదు త్రివిక్రమ్ ను గురూజీ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి త్రివిక్రమ్ స్పీచ్.. ఇటీవల కొందరిని హర్ట్ చేసిందట. గురూజీ స్పీచ్ వల్ల హర్ట్ అయ్యింది మరెవరో కాదు మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. విషయం ఏమిటంటే.. గతేడాది సంక్రాంతికి విడుదలై నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఏడాది పూర్తయిన సందర్భంగా ఇటీవల రీ యూనియన్ ఫంక్షన్ ను ఏర్పాటు చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు ఆ చిత్రం యూనిట్ సభ్యులు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ స్పీచ్ ఇస్తున్నప్పుడు..

‘ఇది నా మరో అతడు’ అని ‘అల వైకుంఠపురములో’ గురించి అన్నాడట. ఇక్కడే పవన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అత్తారింటికి దారేది’ వంటి ఇండస్ట్రీ హిట్ వస్తే.. దానిని పక్కన పెట్టి ‘అతడు’ గురించి చెప్పడమేంటి అని పవన్ అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు. బహుశా ‘అతడు’ ని టీవీ ఛానల్లో ఎక్కువ సార్లు టెలికాస్ట్ చెయ్యడం వల్లే త్రివిక్రమ్ అలా అనుంటాడు అని కొందరు అంటుంటే.. మరి అదే ఛానల్ వారు ‘అత్తారింటికి దారేది’ సినిమాని కూడా ఎక్కువ సార్లు టెలికాస్ట్ చేస్తున్నారు కదా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus