టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి మనం పెద్దగా పరిచయం చెయ్యాల్సిన పని లేదు…ఆయన అడుగే ఒక ప్రభంజనం…ఇక ఆయన సినిమా వస్తుంది అంటే చాలు…అభిమానులు ఆనందంలో మునిగి తేలిపోతారు. మరి అలాంటి పవన్ కల్యాణ్ విషయంలో గూగుల్ చేసిన నిర్వాకం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారి తీసింది…ఇంతకీ అసలు ఏం జరిగింది? పవన్ గురించి గూగుల్ చేసిన తప్పు ఏంటి? అంటే…పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పేరు మార్చేసింది గూగుల్ సెర్చ్ ఇంజిన్..పవన్ కళ్యాణ్ అని గూగుల్ లో టైప్ చేసి చూస్తే కుషాల్ బాబు అని వస్తుంది. అదేంటో విచిత్రం ఎవరికి అంతు చిక్కట్లేదు. పవన్ పేరు మార్చుకున్నాడా లేక త్రివిక్రం సినిమా కోసం పవన్ కుషాల్ బాబు అయ్యాడా అన్నది ఎవరికీ అర్ధం కానీ విషయం. ఇక పవన్ కల్యాణ్ హిస్టరీ తీసుకుంటే…కొణిదెల కళ్యాన్ బాబు కాస్త పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇక యూత్ లో తన పవర్ ఫుల్ ఫాలోయింగ్ చూసి ఆయనకు పవర్ స్టార్ అనే స్క్రీన్ నేం ఇచ్చేశారు.
సౌత్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ ఇలా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో కుషాల్ బాబు అని కనబడటం అందరినీ ఒక్కసారిగా షాకింగ్ కి గురి చేస్తుంది. ఇక ఎవరికి వారు రకరకాలుగా ఆలోచిస్తూ తమ తమ అభిప్రాయాలని ఆన్‌లైన్ లో పెడుతున్నారు… ప్రస్తుతం త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న పవన్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవనుంది. ఈ సినిమా టైటిల్ గా అజ్ఞాతవాసి అని పెట్టబోతున్నారట. అయితే ఒకవేళ ఆ సినిమాలో కుషాల్ బాబు అని పేరు పెట్టారా? సరే ఒక వేళ అదే నిజం అయితే ఈ విషయం మీడియాకి అన్నా ముందు గూగుల్ కి ఎలా తెలుస్తుంది? అసలు ఈ కన్ఫ్యూషన్ ఏంటి అంటూ పవన్ ఫ్యాన్స్ ఫుల్ కన్ఫ్యూషన్ లో ఉన్నారట…మరి దీనిపై గూగుల్ వాళ్లే క్లారిటీ ఇస్తే బావుంటుంది అని అంటున్నాయి పవన్ సన్నిహిత వర్గాలు.