పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలి సినిమా ఏ సినిమా అంటే పవన్ అభిమానులు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని చెబుతారు. అయితే ఈ సినిమా కంటే ముందు పవన్ గొంతు ఒక సినిమాలో వినిపించింది. చిరంజీవి హీరోగా కె. విశ్వనాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో శుభలేఖ సినిమా ఒకటి. చిరంజీవి హైదరాబాద్ కు రాకముందు తన ఫ్యామిలీతో సహా మద్రాస్ లో ఉండేవారు. చిరంజీవి ఇంటి దగ్గరే డబ్బింగ్ థియేటర్ కూడా ఉండేది.
ఆ డబ్బింగ్ థియేటర్ లో శుభలేఖ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్న సమయంలో అన్న చిరంజీవికి టీ ఇవ్వాలని పవన్ ఇంటినుంచి టీ తీసుకుని డబ్బింగ్ థియేటర్ కు వెళ్లారు. ఆ సమయంలో పవన్ వయస్సు పదహారు సంవత్సరాలు కాగా శుభలేఖ మూవీలో చిరంజీవి సర్వర్ పాత్రలో నటించారు. శుభలేఖ మూవీ నిర్మాత వి.వి.శాస్త్రి పవన్ కు డబ్బింగ్ చెప్పమని ఒక చిన్న డైలాగ్ ఇచ్చారు. శుభలేఖ సినిమాలో “మంచినీళ్లు ఎక్కడ సార్” అనే డైలాగ్ తో పవన్ సినీ రంగ ప్రవేశం జరిగింది.
పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఒక విధంగా పవన్ కళ్యాణ్ తొలి సినిమా డైరెక్టర్ కే విశ్వనాథ్ అని చెప్పుకోవాలి. మరోవైపు పవన్ పుట్టినరోజు సందర్భంగా హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తే భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని భావించి మేకర్స్ ఈ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది