జనసేన అధినేత, ప్రముఖ నటుడు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈరోజు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కొంతకాలం క్రితం ఒక అభిమాని పవన్ పై అభిమానంతో ఇచ్చిన పెన్నుతో తొలి సంతకం చేసిన పవన్ వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్నుతో రెండో సంతకం చేశారు. అభిమాని ఇచ్చిన పెన్ విలువ కేవలం 10 రూపాయలు కాగా సురేఖ ఇచ్చిన ఈ పెన్ను విలువ లక్షల రూపాయలు అనే సంగతి తెలిసిందే. అయితే తనకు అభిమానులే ఫస్ట్ ప్రయారిటీ అని పవన్ చెప్పకనే చెప్పేశారు.
విజయవాడ జలవనరుల శాఖలో ఏర్పాటు చేసిన క్యాంప్ కార్యాలయంలో పవన్ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. పవన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీడీపీ ఇంఛార్జ్ వర్మ సైతం పవన్ కు అభినందనలు తెలియజేశారు. తన గెలుపునకు జనసైనికులే కారణమని నమ్ముతున్న పవన్ కళ్యాణ్ ఎంత ఎదిగినా సింప్లిసిటీని చాటుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. పవన్ ను ఇకపై అభిమానులు పవర్ స్టార్ అని పిలవడంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కూడా పిలవనున్నారు.
త్వరలో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా ఆ ఎన్నికలపై కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం అందుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో టీడీపీ మరో స్థానంలో జనసేన పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన శాఖలకు సంబంధించిన అధికారులతో భేటీ అయ్యి వాళ్లకు కీలక సూచనలు చేయనున్నారు.
పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో సినిమా షూటింగ్ లతో బిజీ అయినా తన బాధ్యతలకు సంబంధించి ఏ మాత్రం ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని సమాచారం అందుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సంతకం ఉపాధి హామీ పథకానికి ఉద్యాన వన పనులను అనుసంధానించి నిధుల మంజూరుపై చేయగా గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం చేశారని తెలుస్తోంది.
— patriotism only by Pawan Kalyan (@RajGangireddy) June 19, 2024