Pawan Kalyan: సీనియర్ ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్న పవన్.. ఆ ఆహారం తీసుకుంటూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. వరుసగా సినిమాలను ప్రకటించడంతో పాటు సినిమాల షూటింగ్ లు వేగంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చేశారు. వినోదాయ సితం రీమేక్ లో పవన్ దేవుడిగా కనిపించనున్నారనే సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసమే పవన్ తన లుక్ ను మార్చారని సమాచారం అందుతోంది. పవన్ కొత్త లుక్ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో పవన్ పాత్ర పరిమితం కాగా 20 నుంచి 25 రోజుల పాటు పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం అందుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు పవన్ సాత్వికాహారం తీసుకోనున్నారని తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వ్యాయామాలు చేస్తున్నారని ఈ సినిమాలో ఫిట్ గా కనిపించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ కూడా భక్తి ప్రాధాన్యత ఉన్న పాత్రలు, దేవుని పాత్రలు పోషించే సమయంలో సాత్వికాహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు.

ఈ విషయంలో పవన్ సీనియర్ ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్నారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు షూట్ ఎప్పటికి పూర్తవుతుందో ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా విడుదలైతే మాత్రమే క్రిష్ మరో సినిమాపై దృష్టి పెట్టగలరు. క్రిష్ కెరీర్ లో ఎక్కువ కాలం షూట్ జరుపుకున్న సినిమాగా ఈ సినిమా నిలిచింది.

అయితే హరిహర వీరమల్లు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా ఏ రేంజ్ లో రికార్డులను సొంతం చేసుకుంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదని కొంతమంది చెబుతున్నారు. పవన్ ఇప్పటికే ప్రకటించిన సినిమాలను పూర్తి చేయాలంటే మరో రెండేళ్ల సమయం పడుతుందని తెలుస్తోంది. పవన్ సురేందర్ రెడ్డి కాంబో మూవీ గురించి కూడా త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఒక్కో సినిమాకు పవన్ కళ్యాణ్ 50 నుంచి 75 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus