Pawan Kalyan: తన డ్యాన్స్‌, ఏవీలపై పవన్‌ కల్యాణ్‌ ఫన్నీ కామెంట్స్‌!

ఓ కూల్‌ మ్యూజిక్‌ బ్యాగ్రౌండ్‌లో ప్లే అవుతుంటే పవన్‌ కల్యాణ్‌ అలా నడుకుంటూ వస్తే చాలు రికార్డులు బద్దలైపోతాయి అంటుంటారు. ఈ మాట మేం అన్నది కాదు. ‘అత్తారింటికి దారేది’ టీజర్‌కి ఫ్యాన్స్‌ ఇచ్చిన అప్లాజ్‌. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలకు ఆఫీట్‌ రిపీట్‌ అయ్యింది. అంతేకాదు పవన్‌ కూడా ఇప్పుడు అదే మాట అంటున్నాడు. పాటలు, బీట్‌లు వేసి డ్యాన్స్‌లు చేయండి అంటే తనకు కష్టమని, కానీ ఫ్యాన్స్‌ కోసమే అలాంటివి చేస్తున్నానని చెప్పాడు. ‘అంటే సుందరానికి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఓ సరదా సంభాషణ జరిగింది.

ఇది నాని సినిమా వేడుక కాబట్టి.. అతనే ముందుండాలని, అందుకే తన ఏవీ ఈ కార్యక్రమంలో వేయొద్దని పవన్‌ ముందుగానే నిర్మాతలకు చెప్పారట. కానీ కార్యక్రమంలో పవన్‌ ఏవీ పడింది. దాని గురించి పవన్‌ మాట్లాడుతూ ‘నేను చెప్పినా వినకుండా నిర్మాతలు ఈ పని చేసినందుకు కోపంగా ఉందని, కానీ ప్రేక్షకుల గురించి ఇలా చేశారని నాకు తెలుసు’ అని నవ్వేశాడు పవన్‌. అంతకముందు ఏవీలో పవన్‌ డ్యాన్స్‌లు వేసిన బిట్స్‌ ఉన్నాయి. పాత సినిమాల నుండి వాటిని నేర్పుగా ఎడిట్‌ చేశారు.

ఏవీ ఆఖరులో ప‌వ‌న్ సిగ్నేచ‌ర్ స్టెప్పుల్ని వ‌రుస‌గా చూపించారు. ఈ వీడియో చూస్తున్నంతసేపూ ప‌వ‌న్ న‌వ్వుతూనే ఉన్నాడు. ఆ త‌ర‌వాత వేదిక‌పై మాట్లాడుతున్న‌ప్పుడు… ఆ డ్యాన్స్‌లు చూశాక .. అవన్నీ నేనే చేశానా? మళ్లీ చేయగలనా అనే భయం వేసింది అని పవన్‌ కల్యాణ్‌ అన్నాడు. “నాకొచ్చేవే రెండు, మూడు స్టెప్పులు. వాటిని అటూఇటూ మార్చి వేసేస్తుంటా అని తన డ్యాన్స్‌ గురించి తనే సెటైరికల్‌గా చెప్పుకొచ్చాడు పవన్‌.

‘‘నాకు డాన్సులు వేయ‌డం ఇష్టం ఉండ‌దు. కానీ అభిమానుల‌కు భ‌య‌ప‌డి స్టెప్పులేస్తుంటా. నాకైతే న‌డుచుకుంటూ వెళ్లిపోవ‌డం ఇష్టం. నాతో ప‌నిచేసే ద‌ర్శ‌కులంతా నాతో స్టెప్పులేయించ‌కండి, న‌డుచుకుంటూ వెళ్లిపోయేలా డాన్సులు రూపొందించండి’’ అని పవన్‌ స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు. దీంతో పవన్‌ మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus