పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమేక్ లు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.ఏ భాషలో మంచి కథతో సినిమా తెరకెక్కినా… తన ద్వారా తెలుగు ప్రేక్షకులకి ఎక్కువగా రీచ్ అవుతుందని ఆయన నమ్ముతుంటారు. ‘వకీల్ సాబ్’ ‘భీమ్లా నాయక్’ తో సహా ఇప్పటివరకు పవన్ 10 కి పైగా రీమేక్ సినిమాల్లో నటించారు. త్వరలో మరిన్ని రీమేక్ సినిమాల్లో నటించడానికి ఆయన రెడీ అవుతున్నారు. అందులో ‘తేరి’ ‘వినోదయ సీతం’ చిత్రాలు కూడా ఉన్నాయి.
నిజానికి ఇవి రెండు కూడా తెలుగులో డబ్ అయిన సినిమాలే..! అయినా సరే పవన్ వీటి రీమేక్ లలో నటించడానికి రెడీ అవుతున్నారు. ముందుగా ‘వినోదయ సీతం’ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. తమిళ్ లో సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించనున్నాడు. తెలుగు నేటివిటీకి తగినట్టు చాలా మార్పులు చేయబోతున్నారు.నిజానికి ఒరిజినల్ లో రెండు పాత్రలకి మాత్రమే స్కోప్ ఉంటుంది.
సినిమా మొత్తం ఆ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. అందులో ఒకటి వయసు మీద పడ్డ పాత్ర.. మరొకటి టైంగా కనిపించే వ్యక్తి పాత్ర. మిగిలిన పాత్రలకు ఎక్కువ ప్రాముఖ్యత అయితే ఉండదు. అయితే తెలుగులోకి వచ్చేసరికి సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ లు కలిసి నటించబోతున్నారని టాక్ నడుస్తుంది. మరి ఎవరు ఏ పాత్రల్లో నటిస్తారో క్లారిటీ లేదు. అయితే ఈ చిత్రం షూటింగ్ కోసం పవన్ 20రోజులు కాల్షీట్లు ఇచ్చారట.
అందుకు గాను ఏకంగా రూ.50 కోట్లు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది. ‘జీ స్టూడియోస్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’, ‘ఫార్చ్యూన్ ఫోర్’ సంస్థలు కలిసి ఈ మూవీని నిర్మించనున్నారు.