పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో ఎక్కువ సంఖ్యలో రీమేక్ సినిమాలలో నటించగా ఆ సినిమాలో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిస్తే మరికొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు. అయితే పవన్ కళ్యాణ్ మరో రీమేక్ కు ఓకే చెప్పారని విక్రమ్ వేద రీమేక్ లో పవన్ నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ఫ్యాన్స్ మాత్రం పవన్ ఈ సినిమాను రీమేక్ చేయవద్దని కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులలో ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాను చూసేశారు.
అయితే విక్రమ్ వేద రీమేక్ లో పవన్ (Pawan Kalyan) నటిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే మాత్రం 2024 ఎన్నికల వరకు ఆగాల్సిందే. పవన్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పూర్తి చేయాలంటే మరో ఏడాది సమయం పడుతుంది. విక్రమ్ వేద రీమేక్ లో పవన్, రవితేజ కలిసి నటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
పవన్ పుట్టినరోజు కానుకగా పవన్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ తో పాటు రిలీజ్ డేట్లకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ తన రేంజ్ ను మరింత పెంచే సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అభిమానులు సంతోషించే ప్రాజెక్ట్ లకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఓజీ నుంచి అప్ డేట్ రానుందని ఇప్పటికే క్లారిటీ రాగా పవన్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి అప్ డేట్స్ వస్తాయో రావో తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ వేగంగా సినిమాలను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వచ్చే ఏడాది పవన్ నటించిన రెండు లేదా మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. పవన్ కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.