Pawan Kalyan: ఆ బ్లాక్‌బస్టర్‌లో వెంకటేశ్‌కి తొలుత స్థానం లేదట… దర్శకుడి క్లారిటీ!

పవన్‌ కల్యాణ్‌, మహేష్‌ బాబు కలసి నటిస్తే చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఆ హీరో, ఈ హీరో అని కాకుండా మొత్తం టాలీవుడ్‌ ఈ సినిమా కోసం ఎదురుచూస్తుంది. ఆ మాటకొస్తే ఇప్పుడు పాన్‌ ఇండియా ఫీవర్‌ ఉంది కాబట్టి… మొత్తం ఇండియానే ఎదురుచూస్తుంది అని చెప్పాలి. అయితే పదేళ్ల క్రితం ఈ కాంబో మిస్‌ అయ్యిందని తెలుసా? ఇది ఏదో పుకారు కాదు… ఆ సినిమా తీసిన దర్శకుడే చెప్పారు.

ఆ సినిమా పేరు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. అవును, మీరు చదివింది కరెక్టే. వెంకటేశ్‌, మహేష్‌బాబు ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రంలోనే ఈ కాంబినేషన్‌ మిస్‌ అయ్యింది. సినిమాలో పెద్దోడు, చిన్నోడు అని ఇద్దరు హీరోలకు పేర్లు పెట్టి మన పక్కింటి కుర్రాళ్లలా చూపించారు శ్రీకాంత్‌ అడ్డాల. ఆ ఇద్దరిలో పెద్దోడి పాత్రలో తొలుత పవన్‌ కల్యాణ్‌ను అనుకున్నారట. అయితే అనుకోని కారణాల వల్ల ఆ పాత్రలోకి వెంకటేశ్‌ వచ్చి చేరారు.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా 2013లో విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర ఘన విజయాన్ని అందుకుంది. మల్టీస్టారర్‌ మూవీలు ఇక కష్టమే అనుకుంటున్న సమయంలో వచ్చి ఆ తర్వాత ఎన్నో మల్టీస్టారర్‌ సినిమాలకు కారణమైంది. అయితే ఇందులోనే వెంకటేశ్‌ పాత్రను పవన్‌ చేయాల్సింది అని శ్రీకాంత్‌ చెప్పారు. శ్రీకాంత్‌ అడ్డాల రూపొందించిన ‘పెదకాపు 1’ చిత్రం ప్రచారంలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

పవన్‌ కల్యాణ్‌తో (Pawan Kalyan) సినిమా తీయలేదు, త్వరలో చేసే అవకాశం ఏమైనా ఉందా అని అడిగితే… ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో పెద్దోడి పాత్ర కోసం పవన్‌ను అనుకున్నామని కానీ కుదరలేదని చెప్పారు. దీంతో భలే కాంబినేషన్‌ మిస్‌ అయ్యిందే అని ఫ్యాన్స్‌ బాధపడుతున్నారు. అయితే గతంలో వెంకటేశ్‌, పవన్‌తో కలసి ఆ సినిమా అనుకున్నారని, కానీ కుదర్లేదని వార్తలొచ్చాయి. దీంతో అసలు సంగతి ఇదా అని ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus