Pawan Kalyan, Ram Charan: పవన్ కళ్యాణ్ ను పక్కనపెట్టేసిన రామ్ చరణ్!

రామ్ చరణ్ కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపును అందుకుంటున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ లో తండ్రి మెగాస్టార్ చిరంజీవి సినిమాలను నిర్మస్తూ బిజినెస్ వ్యవహారాల్లో కూడా చూరుగ్గానే పాల్గొంటున్నారు. ఇక ఎప్పటికప్పుడు సరికొత్త కథలపై చర్చలు జాతుపుతూ, అవసరం అయితే మెగా కాంపౌండ్ నుంచి కాకుండా వేరే హీరోలతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ముఖ్యంగా రీమేక్ సినిమాలపై చరణ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకురానున్న విషయం తెలిసిందే.

ఆ తరువాత డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ ను కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. మొదట ఈ కథను పవన్ కళ్యాణ్ కోసమని తీసుకున్నారు. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ వలన కొత్త సినిమాలకు గ్రీన్ సైన్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఇక పవన్ కళ్యాణ్ తో ఇప్పుడు కుదరదని ఆయన పేరును పక్కన పెట్టేసిన రామ్ చరణ్.. రవితేజను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.

ఇక మరొక ముఖ్యమైన పాత్రలో ఏ హీరో నటిస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. నెక్స్ట్ రామ్ చరణ్ RRR సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఆ సినిమా అనంతరం లూసిఫర్ రీమేక్ తో పాటు మరొక కొత్త సినిమాను నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus