పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీకి రిలీజ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెరిగిన సమయంలో వకీల్ సాబ్ రిలీజ్ కావడం, ఏపీలో టికెట్ రేట్లు తగ్గడం, ఇతర కారణాల వల్ల వకీల్ సాబ్ కు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఇబ్బందులు ఎదురైనా పవన్ రీఎంట్రీ మూవీ కావడంతో ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాగా సినిమా రిలీజైన 14 రోజుల తర్వాత థియేటర్లలో కరోనా వల్ల ప్రదర్శనను నిలిపివేశారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్లను సాధించిన సినిమాల్లో వకీల్ సాబ్ 64వ స్థానంలో నిలవడం గమనార్హం. ఇండియాలో మొదటగా విజయ్ నటించిన మాస్టర్ సినిమా 45వ స్థానంలో ఉండగా రవితేజ క్రాక్ 70వ స్థానంలో ఉండటం గమనార్హం. వేణుశ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ సినిమా తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ మూవీ సాధించిన ఈ రికార్డ్ గురించి తెలిసి పవన్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. వకీల్ సాబ్ సినిమాతో తనకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేశారు.
కరోనా, లాక్ డౌన్ వల్ల రిలీజ్ ఆలస్యమైనా ఈ మూవీ సక్సెస్ సాధించింది. పింక్ రీమేక్ అయినప్పటికీ పింక్ ను మించి వకీల్ సాబ్ సక్సెస్ సాధించడం గమనార్హం. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో నటిస్తుండగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!