పవన్ పొలిటీకల్ ఎంట్రీపై అజ్ణాతవాసి ఎఫెక్ట్!

అప్పట్లో అన్నయ్య చిరంజీవికి కూడా ఇదే విధంగా జరిగింది. సినిమాల్లోకి వచ్చే ముందు మంచి హిట్ సినిమా చేద్దామనే ఆలోచనతో ప్రభుదేవాకి అవకాశమిచ్చి “మున్నాభాయ్ లగేరహే” చిత్రాన్ని తెలుగులో “శంకర్ దాదా జిందాబాద్”గా రీమేక్ చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందిన బాణీలు సూపర్ హిట్ అవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డ్యామేజ్ కంట్రోల్ కోసం చిరంజీవి ఆడియో విడుదల వేడుకలోనే “ఇది అన్నీ వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే సినిమా కాదు” అని చెప్పినప్పటికీ.. భారీ అంచనాలతో సినిమా చూసిన యువత తీవ్రంగా నిరాశచెందారు. ఆ తర్వాత సినిమా చిరంజీవి రాజకీయాల్లోకీ రావడం, పోటీ చేయడం, ఓడిపోవడం, ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన “ప్రజారాజ్యం” పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం చకచకా జరిగిపోయాయి.

ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ విషయంలో అదే రిపీట్ అవుతున్నట్లు అనిపిస్తోంది. అప్పటివరకూ తాను క్యామియో రోల్స్ ప్లే చేసిన సినిమాలను పరిగణలోకి తీసుకోని పవన్ కళ్యాణ్.. “శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, శంకర్ దాదా జిందాబాద్” వంటి చిత్రాల్ని కూడా కౌట్ చేసి మరీ “అజ్ణాతవాసి” చిత్రాన్ని తన 25వ చిత్రంగా ప్రకటించడమే కాక ఈ సినిమా తర్వాత పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయి సినిమాలకు గుడ్ బై చెబుతానని కూడా కొన్ని మీటింగ్ లో చెప్పాడు పవన్ కళ్యాణ్. అయితే.. “అజ్ణాతవాసి” దారుణంగా నిరాశపరచడం, ఇప్పటికే దాదాపు 60 కోట్లు నష్టం తెచ్చిపెట్టిన చిత్రంగా డిక్లేర్ చేసేయబడడంతో ఇమ్మీడియట్ గా మరో రెండు సినిమాలు చేయాలని పవన్ డిసైడ్ అయ్యాడట. అందులో ఒక చిత్రాన్ని తన చిరకాల మిత్రుడు ఏ.ఎం.రత్నం నిర్మించనున్నాడట. ఇంకో సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. “అజ్ణాతవాసి” రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాల విషయంలోనే కాక నటన విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొని తన అభిమానుల్ని సంతుష్టులను చేయాలని ఆశిద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus