ఒకరు ఊర మాస్ దర్శకుడు, చిటికతో సుమోలను గాలిలోకి లేపగలిగే దర్శకుడు, ఫ్యాక్షన్ తో చదువును ముడిపెట్టి కధను రక్తి కట్టించగల దర్శకుడు, 10ఏళ్ల గ్యాప్ తరువాత కూడా సీనియర్ నటుడుకి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు…ఈ పాటికే మీకు అర్ధం అయిపోయి ఉండాలి ఆ దర్శకుడు ఎవరో…అతను ఎవరో కాదు మన చిరు శిబిరానికి వీరాభిమాని వీవీ వినాయక్. అయితే బాలయ్య తో సత్తి రెడ్డి అని సుమోలు లేపించినా, ఎన్టీఆర్ తో చారి అంటూ కామెడీ పండించినా…చిరుతో అవినీతి కధలు చెప్పించినా ఆయనకే చెల్లింది. అయితే మరి అలాంటి ఊర మాస్ దర్శకుడు, ఊర మాస్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ తో జత కడితే ఎలా ఉంటుందో తెలుసా? దుమ్ము రేగిపోతుంది, రికార్డులు బద్దలైపోతాయి. అసలు విషయం ఏమిటి అంటే టాలీవుడ్ లో ఒక క్రేజీ కాంబినేషన్ కి శ్రీకారం పడనుంది. పవన్ ఇటు సినిమాల్లోనూ, అటు పొలిటికల్ గాను సేల్ అవ్వాలి అన్న ఆలోచనతో బిజీగా ఉన్నాడు.
అయితే ఇలాంటి క్రమంలో పవన్ 2019లోపు ఎన్ని సినిమాలు చెయ్యగలిగితే అన్ని చేసేసి ఎన్నికల బరిలో ఉంటాడు. ఇక త్రివిక్రమ్ తో తాను చేస్తున్న సినిమానే పవన్ లాస్ట్ సినిమా అన్న టాక్ సైతం ఉంది. కానీ పవన్ కల్యాణ్ తో మాస్ దర్శకుడు వినాయక్ ఒక సినిమా చెయ్యనున్నాడు అన్న టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం…కమర్షియల్ చిత్రాలను తనదైన శైలిలో చిత్రికరించే దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో పవన్ నటించబోతున్నాడు అని, ఓ యాక్షన్ అడ్వెంచర్ కధని పవన్ కోసం వినయ్ రెడీ చేశాడు అని, ఇప్పటికే చిరుతో మెగా150తో మంచి హిట్ అందుకున్న వినయ్ పవన్ తో జతకడితే రికార్డుల ప్రభనజనమే అని ఇప్పుడు టాలీవుడ్ అంతా చర్చించుకుంటుంది. ఏది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ, మొత్తంగా చూసుకుంటే ఈ కాంబినేషన్ వింటుంటేనే వైబ్రేషన్స్ వస్తున్నాయి…ఇక బరిలో దిగితే రికార్డుల వేట తప్పదు అనే చెప్పక తప్పదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.