Lala Bheemla Song: ఆ రికార్డును సొంతం చేసుకున్న భీమ్లా నాయక్!

భీమ్లా నాయక్ సినిమా నుంచి తాజాగా లాలా భీమ్లా సాంగ్ రిలీజ్ కాగా ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ మూవీ నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్ లో ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేశాయి. పవన్, రానా ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా పవన్ ఫ్యాన్స్ కు నచ్చేలా థమన్ ట్యూన్స్ ఇవ్వడం గమనార్హం.

లాలా భీమ్లా సాంగ్ కు 24 గంటలలో ఏకంగా 11.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సౌత్ ఇండియాలోనే ఈ స్థాయిలో వ్యూస్ సాధించిన మరో సాంగ్ లేదని తెలుస్తోంది. జనవరి నెల 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లాలా భీమ్లా పాటను రాయగా త్రివిక్రమ్ లో మంచి పాటల రచయిత ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అరుణ్ కౌండిన్య ఈ పాటను అద్భుతంగా పాడటం గమనార్హం.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. రానా, నిత్యామీనన్, మురళీశర్మ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. పవన్ కు జోడీగా నిత్యామీనన్, రానాకు జోడీగా సంయుక్తమీనన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. వకీల్ సాబ్ తో సక్సెస్ సాధించిన పవన్ ఈ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus