మల్లయోధులతో పవన్ కుస్తీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రాజకీయాల వలన కొంతకాలం గ్యాప్ తీసుకున్న పవన్ ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసిన పవన్.. ప్రస్తుతం మళయాళ సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్‌‌ సెట్స్ పైకి వచ్చేశాడు. ఈ సినిమాతో పాటు ప్యారలల్‌గా క్రిష్ సినిమాను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు పవన్.

ఇటీవల క్రిష్ తన కథకు తగ్గట్లుగా 17వ శతాబ్దపు చార్మినార్ సెట్ వేయించి.. అక్కడ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ కొనసాగుతుండగా.. మల్లయోధులతో వీరోచిత పోరాటానికి రెడీ అయ్యాడట పవన్. ఈ క్రమంలో సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఫోటోలు దర్శనమిచ్చాయి. భారీ దేహాలతో ఉన్న మల్లయోధులతో పవన్ తలపడేట్లు కనిపిస్తున్నాడు. ఈ పహిల్వాన్ లతో కలిసి పవన్ దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాలో పవన్ వజ్రాల దొంగగా కనిపించనున్నారు. ఈ గెటప్ కోసం క్రిష్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ రాంపాల్‌.. మొఘల్‌ చక్రవర్తి జౌరంగజేబు పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus