గత కొన్ని రోజులుగా ట్విట్టర్ లో కొన్ని మీడియా హౌసెస్ మరియు వాటి యాజమాన్యంపై భారీ స్థాయిలో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే సదరు ట్వీట్స్ కారణంగా కొన్ని లీగల్ నోటీసులు అందుకొన్నారు. అవి చాలావన్నట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేస్ వేశారు. మీడియాలో టెలికాస్ట్ అయిన కథనాలను వక్రీకరించి తన ట్విట్టర్ ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నడంటూ సదరు కంప్లైంట్ లో పేర్కొనడం గమనార్హం. జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు ఈ కంప్లైంట్ ను నమోదు చేశారు.
ఈ కేస్ కారణంగా పవన్ కళ్యాణ్ కి మైనస్ ఏమీ లేకపోయినా.. రాజకీయాల్లో స్ట్రాంగ్ అవ్వాల్సిన తరుణంలో ఇలా మీడియా పెద్దలు, ప్రతినిధులతో గొడవలు, మనస్పర్ధలు అవసరమా అని కొందరి వ్యాఖ్యానిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఈ ట్విట్టర్ దాడిని పక్కనపెట్టి ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే బాగుంటుంది.