ఎవరు ఏం చేస్తున్నారో, లేక అలా రాసి పెట్టుందో తెలియదు కానీ… పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ సినిమాకు మాత్రం బాలారిష్టాలు తప్పడం లేదు. ఎప్పుడో మొదలై, ఈ పాటికి విడుదలవ్వాల్సిన సినిమా ఇంకా కొబ్బరికాయనే కొట్టుకోలేదు. జూన్ ఆఖరునో, జులైన మొదట్లోనే సినిమా షురూ అని అంటున్న ఈ సమయంలో మరో వార్త వచ్చి కలవరపెడుతోంది. అదే ‘వినోదాయ చిత్తాం’. ఆఁ! ఈ తమిళ సినిమా రీమేక్ పనులు చివరిదశకొచ్చాయట. అంతేకాదు త్వరలో కొబ్బరికాయ కూడా కొట్టేస్తారట.
తమిళంలో సముద్రఖని నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘వినోదాయ చిత్తాం’. అక్కడ మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమాను తెలుగులోకి తీసుకురావాలని చూస్తోంది జీ టీమ్. దీని కోసం పవన్ కల్యాణ్‌తో చర్చలు జరిపారు. ఈ సినిమా విషయంలో పవన్ సానుకూలంగా ఉన్నారని వార్తలొచ్చాయి. అయితే ఆ సినిమాలో సముద్రఖని పాత్రలో అంతగా హీరోయిజం ఉండదు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆందోళన పడ్డారు. ఇలాంటి పాత్రలో పవన్ అంటే ‘నో’ అనుకున్నారు. కానీ అనుకున్నదే అవుతోంది. ఆ సినిమా స్టార్ట్ చేస్తున్నారట.
తెలుగులో కూడా సముద్రఖనినే దర్శకత్వం వహిస్తారట. బుర్రా సాయిమాధవ్ ఈ సినిమాకు మాటలు రాస్తున్నారట. ఆ పని చివరికొచ్చిందట. ఇక ఈ సినిమాలో పవన్‌తోపాటు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడని టాక్. ఈ మొత్తం విషయాలపై త్వరలో క్లారిటీ ఇచ్చేస్తూ సినిమాను అనౌన్స్ చేస్తారట. అయితే జీ స్టూడియోస్‌తో పాటు మరో నిర్మాత కలసి ఈ సినిమా నిర్మిస్తారట. అదెవరు అనేది తెలియడం లేదు.
త్రివిక్రమ్ సొంత నిర్మాణ సంస్థ ఫార్య్చూస్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాలో భాగస్వామ్యం అవుతోందని టాక్. తెలుగుకు తగ్గట్లుగా, పవన్ ఇమేజ్‌కి సరితూగేలా సినిమాలో పాత్రల్ని మెరుగుపరిచేలా ప్రస్తుతం సినిమాలో మార్పులు జరుగుతున్నాయట. ఒకవేళ ఈ సినిమా మొదలైతే హరీశ్ శంకర్ సినిమా మరో రెండు నెలలు వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే ‘వినోదాయ చిత్తం’ రీమేక్‌కి పవన్ 40 నుండి 45 రోజులు డేట్స్ ఇస్తున్నాడట.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!