పవర్ స్టార్ తో మాస్ మహా రాజ్ మల్టీ స్టారర్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో బిజీ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని చేస్తూనే మరో పక్క్ క్రిష్ డైరెక్షన్లో తన 27 వ చిత్రాన్ని కూడా మొదలు పెట్టేసాడు. ఇక దాంతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ చిత్రం చేస్తున్నట్టు కూడా ప్రకటించేసాడు. మరో పక్క తరువాతి చిత్రాల కోసం కూడా కథలు వింటున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా పవన్ ఓ మల్టీ స్టారర్ కథని ఓకే చేసినట్టు వినికిడి.

ఇప్పటి వరకూ పవన్ చేసిన ఒకే ఒక్క మల్టీ స్టారర్ ‘గోపాల గోపాల’. ఈ చిత్రం డైరెక్ట్ చేసిన కిశోర్ పార్థసాని(డాలీ) తోనే ఇప్పుడు మరో మల్టీ స్టారర్ చేయబోతున్నట్టు టాక్. ఈ మల్టీ స్టారర్ లో మరో హీరోగా మాస్ మహారాజ్ రవితేజ నటిస్తాడని తెలుస్తుంది. రవితేజ తో ‘నేల టిక్కెట్’ ‘డిస్కో రాజా’ చిత్రాల్ని నిర్మించిన ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ అధినేత రామ్ తళ్లూరి … ఈ క్రేజీ మల్టీ స్టారర్ ను నిర్మించ బోతున్నట్టు తెలుస్తుంది.

రవితేజ తో చేసిన ఆ రెండు చిత్రాలు పెద్ద డిజాస్టర్ లు కావడం వల్ల చాలా నష్టాలలో కూరుకుపోయాడు నిర్మాత రామ్ తళ్లూరి.ఇప్పుడు ఈయన్ని ఆ అప్పుల్లో నుండీ విడిపించడం కోసమే పవన్ ఈ మల్టీ స్టారర్ చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరి హీరోలకు రామ్ తళ్లూరి మంచి మిత్రుడు. ‘నేల టిక్కెట్’ ప్రీ రిలీజ్ కు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హజరయ్యాడు. మరి ఈ క్రేజీ మల్టీ స్టారర్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus