Pawan Kalyan: మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతీ రూపాయి విలువైనది.. పవన్ కామెంట్స్ వైరల్!

  • September 8, 2024 / 08:41 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఎడతెరపి కురిసిన వర్షాల వల్ల ప్రజలు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం ప్రజలు వరద నీటి వల్ల తీవ్రస్థాయిలో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. వరద బాధితులను ఆదుకోవడానికి సినీ, రాజకీయ ప్రముఖులు తమ వంతు సహాయం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. విరాళం ప్రకటించిన వాళ్లకు పవన్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు. సామాన్య ప్రజలు సైతం సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ వంతు సహాయం చేస్తున్నారు.

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  వీరాభిమాని ఒకరు తాను పనికి వెళ్లి సంపాదించిన 600 రూపాయలను సీఎం సహాయనిధికి పంపిస్తున్నానని ఆదివారం కూడా పని ఉందని ఆ డబ్బును కూడా పంపిస్తానని పేర్కొన్నారు. ఈ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు స్పూర్తి అని గుడివర్తి సుబ్రహ్మణ్యం అనే అభిమాని తెలిపారు. కష్తాలనేవి అందరికీ వస్తుంటాయని ఆ కష్టం ఏంటనేది కష్టపడిన వాడికి మాత్రమే తెలుస్తుందని పవన్ ఫ్యాన్ వెల్లడించారు.

అయితే ఈ ట్వీట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రిప్లై వచ్చింది. రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుండి వరద బాధితులకు సహాయం చేయాలనుకున్న మీ ఆలోచన స్పూర్తిదాయకమని పవన్ (Pawan Kalyan) అన్నారు. ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతీ రూపాయి విలువైనదని పవన్ వెల్లడించారు. ఆ సహాయం తక్కువ మొత్తమని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ అని పవన్ తెలిపారు.

ప్రజల కష్టాల కోసం ఆలోచించి సీఎం సహాయనిధికి సుబ్రహ్మణ్యం పంపిన 600 రూపాయలు విలువైనవని మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. సామాన్యుడి ట్వీట్ కు పవన్ రిప్లై ఇవ్వడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

హైడ్రా నోటీసులపై మురళీ మోహన్ క్లారిటీ.. తప్పు చేయలేదంటూ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus