వర్మ వెర్రి చేష్టలు చూసిన పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏమిటో తెలుసా?

“పవన్ కళ్యాణ్-ఆర్జీవీ” అసలు ఈ ఇద్దరి పేర్లు పక్కపక్కన ఉంటేనే పెద్ద సెన్సేషన్. శ్రీరెడ్డి విషయంలో పవన్ ను వర్మ టార్గెట్ చేసిన విధానం, జనసేనను, సేనానిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా సాక్షిగా ఎగతాళి చేయడం కానీ సర్వసాధారణ విషయం అయిపోయింది. అయితే.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొంటె వేషాలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి నిజంగానే నవ్వు తెప్పించాయిట. ప్ర‌ముఖ‌ల జీవితాల‌పై బ‌యోపిక్‌లు తీసి సంచ‌ల‌నాలు సృష్టించ‌డంలో దిట్ట రామ్ గోపాల్ వ‌ర్మ‌.

లాక్‌డౌన్ స‌మ‌యంలోను వ‌రుస సినిమాలు చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న వర్మ‌.. “ప‌వ‌ర్ స్టార్” పేరుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జీవితంపై ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులోని పాత్ర‌లు ఓ వ్య‌క్తి మాదిరిగా ఉండ‌డం యాదృచ్చికంగా జ‌రిగింద‌ట. కొద్ది రోజులుగా ప‌వ‌ర్ స్టార్ చిత్రంలోని ప్ర‌ధాన పాత్రధారికి సంబంధించి ప‌లు పోస్ట‌ర్స్ విడుద‌ల చేయ‌గా, వీటిపై సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే ప‌వ‌ర్ స్టార్ సినిమా పోస్ట‌ర్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్టికి వ‌చ్చిన‌ట్టు తాజా స‌మాచారం.

పోస్ట‌ర్స్ చూసిన ప‌వ‌న్.. ఆర్జీవిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌కుండా చిన్న చిరున‌వ్వు న‌వ్వార‌ట‌. ప‌వ‌న్ ఫ్యాన్స్ మాత్రం వ‌ర్మ‌ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. కాగా, `పవర్ స్టార్` చిత్రానికి `ఎన్నికల ఫలితాల తర్వాత కథ` అనేది ట్యాగ్ లైన్.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus