Pawan Kalyan: మూడు సినిమాలున్నాయి… ఎవరికో ఆ లక్కీ ఛాన్స్‌… త్వరలో క్లారిటీ!

పవన్‌ కల్యాణ్‌ సినిమా వార్తలు వచ్చి ఓ పది, పదిహేను రోజులు అవుతోంది. అవును, ఎందుకంటే ఆయన పొలిటికల్‌ లీడర్‌ అవతారం ఎత్తాడు కాబట్టి. ‘వారాహి యాత్ర’ మూడో విడతను పవన్‌ కల్యాణ్‌ ఇటీవల ముగించాడు. నాలుగో విడతకు ఇంకాస్త సమయం ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ మళ్లీ సినిమా షూటింగ్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లే అని చెబుతున్నారు. దీంతో కౌన్‌ బనేగా కరోడ్‌ పతీ ప్రశ్న లాగా ‘ఫస్ట్‌ ఏ సినిమా?’ అనే ప్రశ్న మొదలైంది.

పవన్‌ కల్యాణ్‌ నుండి ఇటీవల ‘బ్రో’ సినిమా వచ్చింది. దీంతో మరో మూడు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. స్టార్ట్‌ అయిన ఆర్డర్‌, లేదా అనౌన్స్‌ చేసిన ఆర్డర్‌లో చూస్తే ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’, ‘ఓజీ’ ఉన్నాయి. దీంతో ఈ మూడింటిలో ఏ సినిమా షూటింగ్‌ ఇప్పుడు మొదలవుతుంది అనేది చూడాల్సి ఉంది. అయితే అనౌన్స్‌ ఆర్డర్‌కీ, సినిమా షూటింగ్‌ పూర్తి అయిన ఆర్డర్‌కి డిఫరెన్స్‌ ఉంది. దీంతో దాని ఆధారంగా కొత్త డేట్స్‌ పవన్‌ ఇస్తాడని అంటున్నారు. ఆ లెక్కన ‘ఓజీ’ సినిమా షూటింగ్‌ త్వరలో ఉండొచ్చు అంటున్నారు.

సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజీ’ సినిమా షూటింగ్‌ పక్కా ప్లానింగ్‌తో జరుగుతోంది అంటున్నారు. పవన్‌ ఇచ్చిన తక్కువ డేట్స్‌తో సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. అందుకే ఈ సినిమా 60 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కాబట్టి ఈ సినిమాకు తొలుత డేట్స్‌ ఇచ్చి సినిమా పూర్తి చేస్తారు అని అంటున్నారు. అయితే ఆ సినిమా ఇప్పటికే ముందుకెళ్లింది కాబట్టి ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాకు డేట్స్‌ ఇస్తారని అంటున్నారు. అయితే సెట్స్‌ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ‘హరి హర వీరమల్లు’కి కూడా ఇవ్వొచ్చు అంటున్నారు.

ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు. సెప్టెంబరు 2న పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాల నుండి టీజర్‌/ స్పెషల్‌ వీడియోలు వచ్చే అవకాశం ఉంది. దానికి కావాల్సిన స్టఫ్‌ ఈ పది రోజుల్లో ఎవరైనా సిద్ధం చేస్తారేమో చూడాలి. లేదంఏ ఆ రోజు పోస్టర్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus