Balakrishna Golden Jubilee Celebration: బాలయ్య సినీ ప్రయాణానికి 50 ఏళ్లు.. ఆ హీరోలను ఆహ్వానిస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య (Balakrishna) నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సెప్టెంబర్ నెల 1వ తేదీన హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ లో అంగరంగ వైభవంగా ఈవెంట్ ను నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ ఈవెంట్ కు హాజరయ్యే అతిథులకు ఆహ్వానాలు అందాయని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ (Jr NTR) , కళ్యాణ్ రామ్ (Kalyan Ram) లకు ఆహ్వానాలు అందాయో లేదో క్లారిటీ అయితే లేదు. ఆహ్వానాలు అంది ఉంటే అందుకు సంబంధించిన ఫోటోలు రిలీజై ఉండేవి.

Balakrishna Golden Jubilee Celebration

ఈవెంట్ సమయానికి ఈ ఇద్దరు హీరోలకు ఆహ్వానాలు అందాలని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను ఒకే వేదికపై చూస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. ఇతర ఇండస్ట్రీల సినీ ప్రముఖులకు సైతం ఈ వేడుకలకు ఆహ్వానం అందిందని కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హాజరు కానున్నారని భోగట్టా. మలయాళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారని తెలుస్తోంది.

ఈ ఈవెంట్ లో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి సంబంధించి కూడా అప్ డేట్ వచ్చే ఛాన్స్ కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మోక్షజ్ఞ క్రేజ్ పరంగా టాప్ లో ఉండేలా బాలయ్య ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్య స్వర్ణోత్సవ సంబరాల వేడుకకు ఎన్నో ప్రత్యేకతలకు సైతం వేదిక కానుందని తెలుస్తోంది. బాలయ్య ఒక సినిమా పూర్తైన వెంటనే మరో సినిమాలో నటిస్తూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

బాలయ్య బాబీ (Bobby) కాంబో మూవీ టైటిల్ టీజర్ త్వరలో రిలీజ్ కానుండగా ఈ ఏడాది బాలయ్య సినిమాలేవీ రిలీజ్ కావడం లేదనే వార్త అభిమానులను ఒకింత షాక్ కు గురి చేసిందనే చెప్పాలి. బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమాలను రీరిలీజ్ చేయాలని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలయ్య బాబీ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ప్రభాస్ మూవీపై ఆశలు పెట్టుకున్న బ్యూటీ.. ఆశలు నెరవేరతాయా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus