Pawan Kalyan Remuneration: OG కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకోబోతున్న పవన్.. ఎన్ని కోట్లో తెలుసా?

పవన్ కళ్యాణ్…యంగ్ డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ – ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు ముంబైలో జరుగుతున్నాయి ఇలా శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీసుకునే రెమ్యూనరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఊహించని స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకు అంటున్నారని సమాచారం. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా 100 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్నటువంటి ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాని ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 22వ తేదీ విడుదల చేయాలని మేకర్స్ భావించినట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్‌ కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో పవన్‌ మూడు విభిన్న వేరేయేషన్స్‌ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడట. ఒకటి టీనేజర్‌ కాగా, రెండు కాలేజీ స్టూడెంట్‌ , మూడు డాన్‌ ఇలా మూడు విభిన్న పాత్రలలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారని తెలుస్తుంది.

ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఇతర సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus